క‌రోనా వైర‌స్‌.. ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి.. దేశాల‌న్నీ అత‌లాకుత‌లం అవుతున్నాయి.. జ‌న‌జీవ‌నం మొత్తం స్తంభించిపోయింది. ఇప్ప‌టికే సుమారు 20వేల మందికిపైగా ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. సుమారు నాలుగున్న‌ర ల‌క్ష‌ల‌కుపైగా మందికి  ఈ వైర‌స్ సోకింది. క‌రోనా వైర‌స్‌కు విరుగుడు క‌నిపెట్టేందుకు ప్ర‌పంచ దేశాల శాస్త్ర‌వేత్త‌లు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో క‌రోనా వైర‌స్‌పై అనేక వ‌దంతులు కూడా వినిపిస్తున్నాయి. ఇలా చేస్తే.. క‌రోనా మ‌న ద‌రిచేర‌నే చేర‌దు..! అలా చేస్తే.. ఈ మ‌హ‌మ్మారిని త‌రిమికొట్ట‌వ‌చ్చు..?  ఇవి పాటించండి.. మీరు క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్టే..!  అదిగ‌దిగో.. క‌రోనా మందు త‌యారైంది.. అక్క‌డ వాడుతున్నారు..! ఇలా సోష‌ల్ మీడియాలో ఎవ‌రికితోచిన‌ట్లు వారు పోస్టులు పెడుతున్నారు. ఎవ‌రికితోచిన‌ట్లు వారు ప్రచారం చేస్తున్నారు.

 

అయితే.. ఈ మ‌ధ్య‌లో మ‌రొక ప్ర‌చారం కూడా జోరుగా జ‌రుగుతోంది. అదేమిటంటే.. గొంతును వెచ్చ‌గా ఉంచుకుంటే.. క‌రోనా మ‌న శరీరంలోకి చేర‌ద‌నీ.. 15 నిమిషాల‌కు ఒక‌సారి నీళ్లు తాగితే క‌రోనాకు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చున‌ని..!  ఈ పోస్టులు.. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.. అయితే.. మొద‌టి నుంచి ఇలాంటి ప్ర‌చారాల‌పై ప్ర‌భుత్వాలు, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అప్ర‌మ‌త్తంగా ఉంటున్నాయి.. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ప్ర‌జ‌లు వ‌దంతులను న‌మ్మొద్ద‌ని, సొంత వైద్యం మంచిది కాద‌ని, ఇప్ప‌టికీ క‌రోనాకు మందు లేద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేస్తూనే ఉన్నాయి... భార‌త్‌లో కూడా ఎన్‌డీఎంఏ కూడా ఈ ప్ర‌చారంపై అప్ర‌మ‌త్త‌మైంది. గొంతును వెచ్చ‌గా ఉంచుకోవ‌డం వ‌ల్ల‌, 15 నిమిషాల‌కు ఒక‌సారి నీళ్లు తాగ‌డం వ‌ల్ల క‌రోనా రాద‌ని జ‌రుగుతున్న ప్రచారంలో ఏమాత్ర‌మూ నిజం లేద‌ని తేల్చి చెప్పింది. అలాంటి ప్ర‌చారాల‌ను న‌మ్మొద్ద‌ని సూచించింది.

 

వేడి వాతావ‌ర‌ణంలో కూడా క‌రోనా వైర‌స్ జీవించ‌గ‌ల‌ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇప్ప‌టికే ప‌లుమార్లు పేర్కొంది. నీళ్లు తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం డీహైడ్రేష‌క్‌కు గురికాకుండా ఉంటుంద‌ని, అందుకే నీళ్లు తాగాల‌ని చెబుతున్నామ‌ని అంటోంది. నీళ్లు తాగ‌డం వ‌ల్ల క‌రోనా వైర‌స్ మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశించ‌ద‌న్న ప్ర‌చారంలో ఎంత‌మాత్ర‌మూ నిజం లేద‌ని ఎన్‌డీఎంఏ పేర్కొంది. ఇదిలా ఉండ‌గా.. క‌రోనా వైర‌స్‌పై వ‌దంతులు పుట్టించేవారిని, త‌ప్పుడు ప్ర‌చారం చేసేవారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇప్ప‌టికే కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లువురిపై పోలీసులు కేసులు కూడా న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: