కరోనా వైరస్ గా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఇప్ప‌టికే 21 రోజుల పాటు ప్ర‌జ‌లు ఇవ్వ‌రూ త‌మ త‌మ ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని సీరియ‌స్‌గా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు సైతం ప్ర‌జ‌లు ఎవ్వ‌రూ రోడ్ల మీద‌కు రాకుండా చాలా సీరియ‌స్‌గా లాక్ డౌన్ అమ‌లు చేస్తున్నాయి. ఈ విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాయి. బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌జ‌ల‌ను పోలీసులు మొఖ్కూ మొఖం చూడ‌కుండా కొడుతున్నారు. ఈ విష‌యంలో దేశంలో చాలా రాష్ట్రాలు చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాయ‌నే చెప్పాలి. అయితే ఎంత చేసినా వైర‌స్ మాత్రం ఏదోలా విస్త‌రిస్తూనే ఉంది.

 

కేవ‌లం ఒక్క వ్య‌క్తికి క‌రోనా వైర‌స్ సోకినా ఆ వ్య‌క్తి నుంచి దేశం అంతా క‌రోనా సోకుతుంద‌ని అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇదే జ‌రిగింది. ఢిల్లీలో ఓ మహిళ ద్వారా ఓ డాక్టర్ కు కరోనా వైరస్ సోకింది. టెస్టులు చేయగా పాజిటివ్ వ‌చ్చింది. ఎంత దారుణం ఏంటంటే ఈ డాక్డ‌ర్‌కు క‌రోనా సోకాక ఆమె 900 మందికి ట్రీట్‌మెంట్ చేసింది. ఇప్పుడు ఆమె ట్రీట్‌మెంట్ చేసిన వారంద‌రికి టెస్టులు చేయ‌గా వారికి కూడా క‌రోనా పాజిటివ్ లక్ష‌ణాలు క‌న‌ప‌డ్డాయ‌ట‌. దీంతో షాక్ తిన్న కేంద్ర ప్ర‌భుత్వం చివ‌ర‌కు వీరంద‌రిని 14 రోజుల పాటు ఐసోలేష‌న్ వార్డుకు పంపారు. 

 

ఈశాన్య ఢిల్లీలో మొహల్లా క్లినిక్ లో పని చేస్తున్న వైద్యుడికి కరోనా సోకింది. ఆ త‌ర్వాత అత‌డి ద‌గ్గ‌ర‌కు జ‌బ్బుల కోసం చికిత్స‌కు వెళ్లిన వారంద‌రికి క‌రోనా సోకింది. కోరోనాకు గురైన ఓ మ‌హిళ ద్వారా ఆ డాక్ట‌ర్‌కు ఆ వ్యాధి సోకింది. చివ‌ర‌కు అలా మొత్తం 900 మందికి ఈ వైర‌స్ అక్క‌డ నుంచే సోకింది. ఇక క‌రోనాకు గురైన ఆ డాక్ట‌ర్‌ను ముందుగా జీటీబీ హాస్ప‌ట‌ల్‌కు ఆ త‌ర్వాత స‌ప్ద‌ర్ జంగ్ హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు.  ఇప్పుడు ఆ ఒక్క మహిళ‌ వల్ల 900 మంది ఈ మహమ్మారి వలలో చిక్కుకున్నారు. ఇది భార‌త్‌కే పెద్ద షాకింగ్ న్యూస్‌. దీనిని బ‌ట్టి క‌రోనా ఎంత డేజంరో అర్థ‌మ‌వుతోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

applehttps://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: