కరోనా దెబ్బకి భారత ప్రధాని మోడీ 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో ఎక్కడున్న ప్రజలు అక్కడ ఉండి పోయారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలో తెలుగు వాళ్ళు అనేక మంది ఉన్నారు. లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడ ఉన్న ప్రజలు వారి వారి సొంత ఊళ్లకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. దింతో వారందరు ఏ వాహనం అందుబాటులో ఉంటె దానితో వారివారి ఊళ్ళకి బయలు దేరారు. ఇంతవారికి బాగానే ఉంది. కానీ అసలు విషయం ఇక్కడే మొదలైంది.

 

 

ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రము నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లే టోల్ గేట్స్ వద్ద యుద్ధవాతావరణమే ఉందని చెప్పవచ్చు. అసలు దీనికి కారణం తెలంగాణాలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు లాక్ డౌన్ ని పూర్తి కట్టుదిట్టంగా అమలుచేయడంలో భాగంగా హైదరాబాద్ లో ఉన్న ప్రజలు పూర్తిగా వారి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలా ఉండలేక చాలా మంది వారి సొంత ఊర్లకి వెళ్ళడానికి వెళ్ళడానికి తెలంగాణ డీజీపీ కార్యాలయం నుంచి అనుమతిని తీసుకోని వచ్చారు. 

 

 

ఇంత వరకూ బాగున్నా రాష్ట్రాల సరిహద్దుల దెగ్గర ఉన్న టోల్ గేట్స్ వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసులు వారిని ఆంధ్రప్రదేశ్ లోకి రావడానికి అసలు అనుమతి ఇవ్వడం లేదు. దీనితో నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద వాహనదారులు, పోలీసుల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఇందులో అనేక మంది ఆడవారు, పిల్లలు ఉండడంతో వాహనదారులు పోలీసులతో మతాల యుద్ధం ప్రాంభించడంతో అది కాస్త అక్కడ యుద్ధ వాతావరణంగా మారింది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: