హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఏపీ ప్రజలకు సీఎం జగన్ అదిరిపోయే భరోసా ఇచ్చారు. హైదరాబాదులోని తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కేసీఆర్ తో తాను మాట్లాడానని.. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాను చూసుకుంటానని కేసీఆర్ చెప్పారని జగన్ భరోసా ఇచ్చారు. ఈ విషయంలో కేసీఆర్ చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అన్నీ తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. అందువల్లే ఎవరకూ భయాందోళనలకు గురికావద్దని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

 

జగన్ ఇంకా ఏమన్నారంటే.. “ సరిహద్దుల వరకూ వచ్చిన వారిని రానిచ్చాం. వీరికి 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచక తప్పదు.. వీరందరినీ తీసుకుని క్వారంటైన్ చేయలేమనే రానివ్వడం లేదు. వారు ఎక్కడెక్కడ తిరిగారో ఈ డాటా అంతా ఎవరి వద్దా ఉండదు. వీరిలో ఏ ఒక్కరిని కరోనా ఉన్నా.. ఇంకో పది మందికి వ్యాపింపజేస్తారు. అందుకే ఎక్కడ ఉన్న వాళ్లం అక్కడ ఉంటేనే మంచిది. ఇది రాష్ట్రం కోసం తప్పదు.”

 

 

" ఇది వందేళ్లకోసారి వచ్చే మహమ్మారి.. అందుకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం.. సరైన సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతే.. చేయి దాటి పోతుంది. అందరూ సహకరించాలి. పక్కనే తెలంగాణ బోర్డర్.. మనవాళ్లను కూడా చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి కూడా లేదా అని మనసుకు చాలా కష్టం అనిపించింది. ఈరోజు కూడా పొందుగుల చెక్ పోస్టు దగ్గర, దాచేపల్లి దగ్గర ఇవే పరిస్థితులు ఉన్నాయి.

 

" ఏ ప్రాంతాల్లో ఉన్నారో అక్కడే ఉండిపోండి.. ఇది చాలా అవసరం.. ఒకసారి ప్రదేశం మారితే వచ్చే వాళ్లు ఎంత మందితో కాంటాక్ట్ లోకి వస్తున్నారు.. ఈ కాంట్రాక్ట్ ట్రేసింగ్ చాలా కష్టమవుతుంది. అప్పుడు అదుపు చేయడం కష్టమవుతుంది. ఎక్కడి వాళ్లు అక్కడ ఉంటే అరికడతాం. మనకు అన్నీ తెలుసు..దేశమేదో అతలాకుతలం అయిపోతుంది కాబట్టి ఇంటికి వచ్చేయాలని అనుకోవద్దు.. ఇవి రెండు మూడు వారాలకు సంబంధించిన అంశాలే.. ఏప్రిల్ 14 వరకూ కాస్త సంయమనం పాటిస్తే.. అన్నీ చక్కబడతాయని జగన్ భరోసా ఇచ్చారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: