కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేకమైన చర్యలు తీసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తమ రాష్ట్ర ప్రజలని నొప్పించకుండా ఉండేందుకు... ఒకవైపు బాధపడుతూనే మరోవైపు కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం సీఎం జగన్ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ... తెలంగాణ నుండి ఆంధ్ర వాసులను కూడా రాష్ట్రంలోకి అడుగుపెట్టేందుకు అనుమతించలేని పరిస్థితి ఏర్పడిందని... అందుకు తాను తీవ్రంగా బాధ పడుతున్నానని తెలిపారు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండకపోతే కరోనా వైరస్ ప్రతి ఒక్కరికి సంక్రమించే ప్రమాదం ఉందని... అందుకే విద్యార్థులందరినీ, అలానే పెద్దవారిని కూడా ఈ విషయం అర్ధం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు జగన్.




అందరూ కలిసి ఈ మహమ్మారిపై యుద్ధం చేయకపోతే భావితరాల పై దారుణమైన ప్రభావం పడుతుందని ఆయనన్నారు. ఒకవేళ ఎవరికైనా తిండి పరంగా కానీ, ఫెసిలిటీస్ పరంగా కానీ, ఉండడానికి ఆశ్రమం లేకపోయినా, ఇంకా ఏదైనా సమస్య వచ్చినా, తీవ్రమైన ఇబ్బందులు ఎదురైనా తక్షణ సాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1902 కి కాల్ చేయండని, అప్పుడు వెంటనే కలెక్టర్ స్పందించి సంబంధించిన అధికారులతో ఎటువంటి సమస్యనైనా పరిష్కరిస్తారని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అలాగే జలుబు, దగ్గు లాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే 104 కి కాల్ చేయమని, అప్పుడు ఏఎన్ఎం మెడిక‌ల్ స‌ర్వీసెంట్లు, గ్రామ స‌చివాల‌యం వాళ్లు, వ‌లంటీర్లు వెంట‌నే అక్క‌డ‌కు వ‌చ్చి వైద్యం అందేలా చేస్తారని జగన్ చెప్పారు.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: