ప్రస్తుతం దేశం మొత్తం అల్లోకల్లోలంగా ఉంది. ఎవరిని ఎవరు నమ్మడం లేదు.. నగరాలు, ఊర్లు, వాడలు అన్ని నిర్మానుష్యంగా మారాయి.. బహుశా ఇలాంటి పరిస్దితిని ఎవరు ఊహించి ఉండరు కావచ్చూ.. ఇప్పుడు జరిగిన, జరుగుతున్న సంఘటనలు అన్ని చరిత్రలో అక్షరాలుగా తప్పక లిఖించబడతాయి.. కనివిని ఎరుగని రీతిలో. అభివృద్ధిని సాధించిన మనిషి కరోనా కొరలకు ఎన్ని ప్రాణాలను బలిచేస్తున్నాడో తలుచుకుంటే కన్నీరు ఆగడం లేదు.. రానున్న రోజుల్లో ఎవరికి ఎవరు అవుతారో, ఏ క్షణం అయిన వారి మరణ వార్త వినవలసి వస్తుందో అనే భయం చాలామందికి వెంటాడుతుంది..

 

 

కరోనా వైరస్ విలయతాండవానికి జనాలు పక్షుల్లా రాలిపోతున్నారు.. ప్రజలంతా ఇప్పుడు బ్రతకడానికి పోరాటం చేస్తున్నారు.. కరోనా వైరస్ తగ్గినాక బ్రతుకుతో పోరాటం చేయవలసిన పరిస్దితులు తలెత్తుతాయి.. అంటే ప్రజల పరిస్దితి ఎలా ఉందంటే ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారింది.. ఇదే కాకుండా మనదేశంలో రోగులు ఎక్కువైతే వారికి తగిన వసతులు అందించడం చాలా కష్టమైన పని.. అమెరికా, చైనా లాంటి దేశాలే ఈ కరోనా వైరస్‌కు గజగజ వణికి పోతుండగా, ఒక క్రమశిక్షణలేని మన ప్రజలతో ఈ ప్రభుత్వాలు ఎలా కరోనా వ్యాప్తిని అరికడతాయో అనే భయం మేధావుల్లో కలుగుతుందట..

 

 

ఇకపోతే దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ బాధితులకు చికిత్స అందజేయడం కోసం ప్రత్యేకంగా హాస్పిటల్‌ను నిర్మించనుంది. మొత్తం 1000 పడకలతో ఈ హాస్పిటల్‌ను నిర్మించాలని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు మన దేశంలో ప్రత్యేకంగా కరోనా వైరస్‌ బాధితుల కోసం నిర్మించే తొలి హాస్పిటల్ ఇదే అవుతుంది.. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: