కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధికున్న ఇంగితం కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడుకు లేకపోయింది. కొరోనా వైరస్ నియంత్రణకు కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సోనియా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 21 రోజుల లాక్ డౌన్ నిర్ణయం భేష్ అంటూ నరేంద్రమోడికి రాసిన లేఖలో సోనియా మెచ్చుకున్నారు. కొరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్రప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందని స్పష్టంగా లేఖలో చెప్పారు. ప్రతిపక్షం బాధ్యత అంటే ఏమిటో సోనియా తన లేఖలో చెప్పింది.

 

సరే మోడిని అభినందిస్తునే వైరస్ నియంత్రణకు కొన్ని సూచనలు కూడా చేశారు. అలాగే వైరస్ నియంత్రణలో 24 గంటలూ పనిచేస్తున్న వారి విషయంలో కేంద్రం తీసుకోవాల్సిన చర్యలను కూడా సలహాలు ఇచ్చారు. అలాగే లాక్ డౌన్ విషయంలో పేదల ఇబ్బందులను కూడా మోడి దృష్టికి తీసుకెళ్ళటమే కాకుండా ఇబ్బందులను అధిగమించేందుకు సూచనలు కూడా చేశారు.

 

సరే సోనియా ఇచ్చిన సూచనలను మోడి పాటిస్తారా లేదా అన్నది వేరే సంగతి. ప్రధాన ప్రతిపక్ష నేత పాత్రను సోనియా చాలా హుందాగా పోషించారనే చెప్పాలి. మరి ఏపి విషయానికి వస్తే ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబునాయుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ? ఇపుడు కూడా రాజకీయాలే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో ఒక్కసారి కూడా అభినందించిన పాపాన పోలేదు. ప్రభుత్వానికి మద్దతుగా నిలబడతామని ఒక్క ప్రకటన కూడా చేయలేదు.

 

మద్దతుగా నిలబడటం, అభినందించక పోయినా పర్వాలేదు. ప్రతిపక్షమంటే ప్రతిదీ వ్యతిరేకించాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా ఆరోపణలు, విమర్శలు చేస్తునే ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోను తప్పులే వెతుకుతున్నారు. హఠాత్తుగా బుధవారం రాత్రి వేలాది మంది ఏపి-తెలంగాణా సరిహద్దుల్లోని జగ్గయ్యపేట దగ్గరకు వచ్చేస్తే దాన్ని కూడా చంద్రబాబు కొడుకు లోకేష్ ఏపి ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నాడు. విజయవాడ నడిబొడ్డున ఓ ఆసుపత్రిలో  ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తుంటే ఎంపి కేశినేని నాని వ్యతరేకిస్తున్నారు. జగన్ మీదున్న కోపాన్ని చంద్రబాబు రాష్ట్రంలోని జనాల మీద చూపుతున్నట్లే ఉంది చూస్తుంటే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: