కరోనా వైరస్.. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వైరస్ ఇదే. ఇలాంటి వైరస్ ను ఎన్నడూ చూసి ఉండరు.. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ పుట్టిల్లు అయినా చైనాను వదిలేసి ప్రపంచాన్ని పీక్కుతింటుంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ఎందరో మృతి చెందారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి అత్యంత వేగంగా వ్యాపిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. 21 రోజులు ఎవరు బయటకు రాకూడదు అని.. ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండాలి అని.. ఇంటి నుండి బయటకు రాకూడదు అని దేశాన్ని మొత్తం వచ్చే నెల 14వ తేదీ వరుకు లాక్ డౌన్ చేశారు. 

 

ఇంకా ఈ కరోనా వైరస్ దెబ్బకు ఆర్ధిక వ్యవస్ద ఎంతదారుణంగా మందగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికే అన్ని రంగాలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. వృద్ధి రేటు తగ్గుదలతో ఇప్పటికే ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. ఆర్ధిక వ్యవస్దపై కరోనా వల్ల మళ్లీ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రూ.లక్షా 70వేల కోట్లతో కరోనా ప్యాకేజీ కేంద్రం ప్రకటించింది. ఇందులో నగదు బదిలీ, నిత్యావసర వస్తువులు ఇవ్వడం, కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సాయంగా కరోనా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం.

 

ఇంకా ఇందులో భాగంగా కూలీలను అదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.. అంతేకాదు.. కరోనా వైరస్ బాధితులకు సేవ చేస్తూన్న వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి  50లక్షల ఇన్సూరెన్స్ కవర్ చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం వారికీ మాత్రమే కాదు.. ఆశావర్కర్లకు కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నట్టు సమాచారం. వచ్చే 3 నెలలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో ఆర్థిక ప్యాకేజ్ అందజేయనున్నారు. అంతేకాదు 80 కోట్లమంది ప్రజలకు నెలకు 5 కేజీల బియ్యం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: