కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూనే ఆర్థిక వ్యవస్థపైన చాలా ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే చాలా దేశాలలో లాక్ డౌన్ విధించారు. దేశంలో లాక్ డౌన్ విధించటం వలన సామాన్య ప్రజలు చాల ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం నిత్యావసర వస్తువులు కూడా లేక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 

బయటికి వెళ్తే పోలీసులు చితక బాదుతున్నారు. వారు చెప్పేది మన మంచికే అని ఇంట్లో కూర్చుంటే తినడానికి తిండి లేదు. వండుకుందాం అనుకున్న ఇంట్లో సరుకులు సరిగ్గా లేకపొవడంతో ప్రజలు పస్తులు ఉండాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ప్రజల నిత్యావసర వస్తువుల కోసం కొన్ని కొత్త పథకాలను ప్రవేశ పెట్టింది. అలాగే కూరగాయలు, పాలు, వాటికీ సమయం కేటాయించారు. ఆ సమయంలోనే వాళ్ళు అన్ని తెచ్చుకోవాలి. సమాయం దాటితే పోలీసు మామ చేతిలో పచ్చడి కావాల్సిందే.

 

దేశంలో లాక్ డౌన్ ప్రకటించాక కూడా కరోనా బాధితుల సంఖ్య తగ్గడం లేదు. దింతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఇంటికే రేషన్ బియ్యం, గోధుమలు, ఇంకా నిత్యావసర వస్తువులను వారి ఇంటి ముందుకే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేపిస్తున్నారు. 

 

ఇప్పుడు వండు కొని తినడానికి సరుకులు ఉన్నాయి కానీ గ్యాస్ అయిపోతే ఎలా అని చాల మంది ఆలోచనలో పడుతున్నారు. నిత్యావసర వస్తువులు ఇచ్చినట్టే ప్రభుత్వం గ్యాస్ ను కూడా ఇవ్వనుందా అనే ఆలోచనలో కొందరు ఉన్నారు. అసలు మనకు సిలిండర్ ను అమలులో ఉన్నాయా అనే సందేహాలు వెలువడుతున్నాయి.

 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నా ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా మామూలుగానే ఉంటుందని కంపెనీలు ప్రకటించాయి. కస్టమర్లు కంగారుపడి బుక్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. చేరవాణిలో సిలిండర్ బుక్ చేసినా ఇంటికే తీసుకొస్తాయి. ఇండేన్ ఎల్‌పీజీ సిలిండర్ల సప్లై కోసం కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నామన్నారు. ఎప్పట్లాగే సిలిండర్లను డెలివరీ చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: