జగన్ పదేళ్ళ రాజకీయం అంతా కష్టాల్లోనే సాగింది. ఆయన మూడు నెలల ఎంపీగా ఉండగానే కొండంత  అండ వైఎస్సార్ చనిపోవడంతో ఒంటరి అయ్యారు. ఆ తరువాత రాజకీయ సాగరంలో తననే నమ్ముకుని ఒక్కసారిగా దూకేశారు. అది ఓ విధంగా  సాహసమే. అయితే అలా చేయడం వల్లనే జగన్ అన్ని రకాలుగా రాటుదేలారని చెప్పాలి. అది జగన్ కి ఇపుడు ఎంతగానో ఉపయోపడుతోంది.

 

జగన్ పదేళ్ళ కష్టానికి జనం మెచ్చి బంపర్ మెజారిటీతో గెలిపించారు. అయితే సీఎంగా జగన్ కుర్చీలో కూర్చున్నారో లేదో అన్ని రకాల కష్టాలు మొదలయ్యాయి. మొదట భారీ వానలతో ఇసుక దొరకడం కష్టమై భవన నిర్మాణ కార్మికులు  ఇబ్బందుల్లో పడ్డారు. ఆ తరువాత ఇంగ్లీష్ మీడియం సహా జగన్ తీసుకున్న అన్ని నిర్ణయాలను విపక్షం వ్యతిరేకిస్తూ వచ్చింది.

 

ఇక జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే లేవదీశారు. అయితే అన్నింటినీ అధిగమించి జగన్ ఇక్కడికి వచ్చారు. ఇక కనీసమాంత్రంగానైనా సమాచారం లేకుండా లోకల్ బాడీ ఎన్నికలు రద్దు చేసి ఇగో మీద గట్టి దెబ్బ కొట్టారు. వీటికి పరాకాష్ట అన్నట్లుగా ఇపుడు కరోనా వైరస్ ఏపీలోకి ఎంటరైంది.

 

ఇపుడు జగన్ ఈ వ్యాధిని వ్యాప్తి చెందకుండా తన పది నెలల సీఎం అనుభవాన్ని రంగరిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే జగన్ కష్టాలను తట్టుకుంటూనే ముందుకు సాగుతున్నారు. ఆయనకు రావాల్సిన సమస్యలు అన్నీ రాజకీయంగా, న్యాయపరంగా, ప్రక్రుతిపరంగా కూడా ఒకేసారి కూడుకుని మరీ వచ్చేస్తున్నాయి. దాంతో జగన్ తొలి ఏడాదిలోనే వీటిని దాటుకుంటూ వెళ్తున్నారు.

 

దాంతో రానున్న రోజుల్లో జగన్ కి ఎదురు వుండదని అంటున్నారు. సెప్టెంబర్ తరువాత ఏపీలో పాలన పూర్తిగా అభివ్రుధ్ధి పధంలో సాగుతుందని ఉగాది పంచాగం పండితులు కూడా చెప్పారు. మొత్తం మీద చూసుకున్నపుడు మొదట్లోనే కష్టాలు అన్నీ చూసుకుంటూ వెళ్తే రానున్న నాలుగేళ్ళలో జగన్ జనంలో మంచి పేరు తెచ్చుకునేలా వెసులుబాటు ఉంటుందని అంటున్నారు.

 

 జగన్ సమర్ధుడైన సీఎం అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి వంటి వారు కూడా ఇపుడు కితాబు ఇస్తున్నారు. ఆయన కరోనా వైరస్ నియంత్రణకు బాగానే చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ ఇంట గెలిచే పనిలో విజయవంతం అవుతాడని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: