కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటిస్తూ అందరిని ఇంట్లోనే కూర్చోమని ఆదేశించారు. అయితే అప్పటినుండి నిత్యావసర సరుకులను తెచ్చుకునేందుకు ప్రజలు సవాలక్ష ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేవలం కొన్ని గంటలు మాత్రమే నిత్యావసర సరుకులను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ... బయట పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయో కూడా పట్టించుకోని చాలా మంది పోలీసులు నిత్యావసర సరుకుల కోసం రోడ్ల మీదకి వచ్చిన ప్రజలను తీవ్రంగా కొడుతున్నారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రజలను అస్సలు కొట్టొద్దని పోలీసులకి చెప్పకపోవడం అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది.




కానీ కొంత మంది ముఖ్యమంత్రులు మాత్రం తమ రాష్ట్ర ప్రజలపై ఎటువంటి లాఠీఛార్జి చేయరాదని ముందస్తుగానే పోలీసులకి చెప్పారు. అలాగే నిత్యావసర సరుకులను ప్రజలకు అందించేందుకు ప్రత్యేక మైన చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా తాము ఇచ్చిన గైడ్ లైన్స్ ని పోలీసులు తూచా తప్పకుండా పాటించాలని... ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వారిపై జరిమానాలు విధించాలి, లేకపోతే కేసులు నమోదు చేయాలని అంతేకాని అమాయక ప్రజల ప్రాణాలు పోయేటట్టు లాఠీ ఛార్జ్ చేయొద్దని చెప్పారు. అలాగే నిత్యావసర సరుకులను విక్రయించే దుకాణాలు 24 గంటల పాటు తెరిచి ఉంచ్చోచని ప్రకటించారు.




పూర్తి వివరాలు తెలుసుకుంటే... తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కలసి ఓ డిజిటల్ ప్రెస్ మీట్ నిర్వహించి... ఢిల్లీలో వంట సామాగ్రి, పాలు, కూరగాయలు విక్రయించే దుకాణాలు రోజుకి 24 గంటలపాటు తెరిచి ఉంటాయని ప్రకటించారు. ఢిల్లీ లో గత 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని... ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం 36 కేసులు నమోదు కాగా... వారిలో 26 మంది విదేశాల నుండి వచ్చిన వారేనని తెలిపారు.




క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: