కరోనా మహమ్మారి విరిసిన పంజాకి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది చనిపోయారు. లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. లాక్ డౌన్ లతో ప్రపంచం మొత్తం నిర్మాన్యుష్యంగా తయారవుతోంది. అసలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కుంటామని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. కానీ ప్రపంచాన్ని తన పాటలతో ఊర్రుతలూగించిన కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ మాత్రం ముందుగానే ఈ విపత్కర పరిస్థితిని ఊహిచారని అంటున్నారు మైకేల్ బాడీ గార్డ్ మ్యాట్ ఫిడేస్....

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BODYGUARD' target='_blank' title='bodyguard-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>bodyguard</a> claims star wore tape and masks to ...

మ్యాట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కరోనా కారణంగా ప్రపంచం పడుతున్న అవస్థలు చూసి స్పందించిన మ్యాట్ ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సంచలన విషయాలు వెల్లడించారు. కరోనా లాంటి మహమ్మారి ఈ భూమిపై విలయం సృష్టిస్తుందని, ఏదో ఒక రోజు ఈ మానవాళి నాసనం అయ్యేది సూక్ష్మ జీవుల బారినపడేనని మైకేల్ చెప్పేవారని మ్యాట్ తెలిపారు. అందుకే ఎల్లప్పుడు మైకేల్ ముఖానికి మాస్క్ లు ధరించి చేతికి గ్లౌజులు వేసుకునేవారని అన్నారు...అంతేకాదు...

IHG wore a clown suit and surgical mask for his romps ...

నేను అనారోగ్యం బారన పదను, అలాంటి పరిస్థితి నాకు రానివ్వను ఎందుకంటే నా అభిమానులని నేను నిరాశపెట్టడలుచుకోలేదని చెప్పేవారట. నాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి ఇలాంటి అందుకు కారణం నా గొంతు ప్రపంచానికి వినిపించడానికే అందుకే నా జాగ్రత్తలో నేను ఉంటాను అని ఎల్లప్పుడూ మైకేల్ చెప్పేవారట. అయితే మైకేల్ అలా చెప్పిన ప్రతీ సారీ తనకి చాదస్తం పెరిగింది అనుకునే వారే గానీ , సీరియస్ గా ఎవరు తీసుకునే వారు కాదని మ్యాట్ పాత స్మృతులని గుర్తు చేసుకున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: