కరోనా...ప్రపంచంతో పాటు మనదేశాన్ని విపరీతంగా భయపెడుతున్న వైరస్. ఈ వైరస్ మనదేశంలో కాస్త ఆలస్యంగానే ప్రవేశించినా, వేగంగా దీని ప్రభావం చూపిస్తుంది. దాదాపు 700కు పైగానే కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఈ కరోనా ప్రభావం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రల్లోనూ ఉంది. అయితే మెజారిటీ రాష్ట్రాలతో పోలిస్తే ఈ కరోనా ప్రభావం ఏపీలో కాస్త తక్కువగానే ఉంది. ఏపీలో ఇప్పటివరకు 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

అయితే పాజిటివ్ కేసులు తక్కువ ఉన్నాయని చెప్పి, ఏపీ ప్రభుత్వం ఏమి రిలాక్స్ కాలేదు. సీఎం జగన్ నిత్యం ఈ కరోనా  వ్యాప్తి పెరగకుండా చర్యలు  తీసుకుంటూనే ఉన్నారు. అలాగే ప్రధాని పిలుపు మేరకు 21 రోజుల పాటు లాక్ డౌన్ కఠినంగా పాటిస్తున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ జగన్..విజన్ ఒకటి మెచ్చుకోవచ్చు. ఆయన అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో వలంటీర్ ప్రభుత్వానికి, ప్రజలకు వారథిగా పని చేస్తున్నారు. ఇక ఇదే వాలంటీర్ల వ్యవస్థ కరోనాపై పోరాటం చేస్తుంది.

 

వాలంటీర్లు ఉండటం వల్లే విదేశాల నుంచి వచ్చిన వారిని త్వరగా గుర్తించగలిగారు. అందరికీ టెస్టులు చేయగలిగారు. అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, వీరి ద్వారా ప్రభుత్వానికి త్వరగా సమాచారం అందుతుంది. ఇక వీరి వల్లే దాదాపు 27 వేలకు పైనే విదేశాల నుంచి వచ్చిన వారిని సర్వే చేయగలిగారు. ఇంకా అవసరమైతే వాలంటీర్ల ద్వారానే మరోసారి వారిని టెస్టులు చేస్తామని జగన్ చెప్పారు. మొత్తానికైతే జగన్ ముందు చూపుతో వాలంటీర్ల వ్యవస్థని ఏర్పాటు చేయడం ఎంత మేలు చేస్తోందో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇక చంద్రబాబు భాషలో చెప్పాలంటే విజన్ అంటే ఇదేనేమో.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: