ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఏపీపై కూడా ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ మహమ్మారి మరింత విజృభించకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగానే ప్రధాని పిలుపు మేరకు 21 రోజుల లాక్ డౌన్ పాటిస్తున్నారు.

 

ఓ  వైపు లాక్ డౌన్ ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా జగన్ ప్రభుత్వం చూసుకుంటుంది. అయితే ఓ వైపు కరోనా మహమ్మారి బారిన పడకుండా జగన్ ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ....నిత్యం ప్రజల కోసం కష్టపడుతుంటే, మరోవైపు టీడీపీ, జనసేన కార్యకర్తలు జగన్ పై దారుణంగా విషం కక్కుతున్నారు. సోషల్ మీడియా వేదికగా జగన్ ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

 

ప్రభుత్వ పరంగా ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దాల్సిన సోషల్ మీడియా వాళ్ళు ఇష్టారాజ్యంగా జగన్ ని విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో రాజకీయం పక్కనబెట్టి ప్రభుత్వానికి సహకారం అందించాల్సిన వారు, జగన్ పై దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు జగన్ అధికారంలోకి వచ్చాకే ఏపీ పరిస్థితి దారుణమైందని, జగన్ అడుగుపెట్టడం వల్లే కరోనా వచ్చిందని విమర్శిస్తున్నారు. అలాగే చరిత్రలో లేని విధంగా టీటీడీ కూడా మూసుకుపోయిందని, దానికి కారణం జగనే అంటూ పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు. అసలు ఏ మాత్రం మనుషులు మాదిరిగా ప్రవర్తించకుండా జగన్ ని విమర్శించడమే పనిగా పెట్టుకుని టీడీపీ, జనసేన కార్యకర్తలు నడుస్తున్నారు.

 

ఇలాంటి విపత్కర సమయాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సూచనలు ఇవ్వాల్సిన వారు జగన్ పై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటికైనా టీడీపీ, జనసేన కార్యకర్తలు జగన్ పై విషం చల్లడం ఆపి, ప్రజలకు మేలు కలిగే పనులు చేస్తే బాగుంటుంది. ఈ విధంగా ట్రోల్స్ చేయడం కంటే కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలకు సలహాలు ఇస్తే బెటర్.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: