మన దేశంలో కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను తీస్తున్న నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ఎదుర్కొనడానికి జగన్ సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. ఆ ప్రభావాన్ని, కరోనా ఇంకా వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి రకరకాల ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామన్నారు. కరోనా వైరస్ అనుమానితులకు వైద్య సహాయాన్ని అందించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఐసొలేషన్ కేంద్రాలను ఏక కాలంలో నెలకొల్పుతోంది.

 

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఐసొలేషన్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకుని రాబోతున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోను వంద పడకల సామర్థ్యంతో కూడిన ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకలతో ప్రత్యేక ఐసొలేషన్ సెంటర్లను నెలకొల్పబోతున్నారు. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్నట్టుగా భావిస్తోన్న కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఈ ఐసొలేషన్ కేంద్రాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే.

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నియోజకవర్గం స్థాయిలో వంద పడకల సామర్థ్యంతో ఐసొలేషన్ కేంద్రాన్ని అందుబాటులోకి తేవడం చిన్న విషయం కాదు .. అంత సులభతరం కాదు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భవనాల కొరత ఏర్పడుతోంది. నియోజకవర్గాల స్థాయిలో వంద పడకలను ఏర్పాటు చేయడానికి అనువైన భవనాలు అందుబాటులో లేవన్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో గురుకుల పాఠశాలల, ఇంజినీరింగ్ కళాశాలల భవన సముదాయాల్లో ఈ ఐసొలేషన్ సెంటర్లను నెలకొల్పుతోంది. గురుకుల పాఠశాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆసుపత్రులు, రోడ్లు-భవనాల శాఖకు చెందిన అతిథిగృహాల్లో ఐసొలేషన్ కేంద్రాలను అందుబాటులోకి తేనున్నారు.

 

ఇక ఇప్పటికే విశాఖపట్నంలో మూడు పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఈ నగరంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే విశాఖపట్నం, చిత్తూరు, కృష్ణా, తూర్పు గోదావరి వంటి కొన్ని జిల్లాలో ఐసొలేషన్, క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు అయ్యాయి. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే మొత్తం 2,382 పడకలతో ఐసొలేషన్, క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలోని వివిధ ఆసుపత్రులు, కళాశాలలను పరిశీలించి కేంద్రాలను ఎంపిక చేశారు.

 

విశాఖ ఇనిస్టిట్యూ ట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో 400 పడకలు, ఆంధ్రా యూనివర్శిటీ హాస్టల్‌లో 200 పడకలు, ప్రభుత్వ మానసిక వైద్య ఆసుపత్రి-90, గాయత్రీ విద్యా పరిషత్‌-90, కంటి ఆసుపత్రి-50, రుషికొండ గీతం వైద్య కళాశాల- 364, గీతం ఆసుపత్రి- 200, గీతం ఇంజనీరింగ్‌ కళాశాల- 748 పడకలతో వాటిని నెలకొల్పారు. అరకు, పాడేరు వంటి ఏజెన్సీ పట్టణాల్లో సైతం ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్లను అందుబాటులోకి తీసుకుని రాబోతున్నారు. ఇది కేవలం ఒక్క జగన్ కి మాత్రమే సాధ్యమవుతుందని ఇప్పుడు ఏ.పి.ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: