కరోనా వైరస్.. ఈ వైరస్ పేరు వింటే చాలు వణికిపోతున్నారు. ఎందుకు అలా వణికిపోతున్నారు అంటే చెప్పలేరు కానీ.. కరోనా వైరస్ నిజంగా రక్షేశంగా వ్యవహరిస్తోంది.. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ పుట్టిళ్లును పూర్తిగా వదిలేసి ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి భారత్ ను అతలాకుతలం చేసింది. ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపించడం వల్ల కేంద్ర ప్రభుత్వం వచ్చేనెల 14వ తేదీ వరుకు ఎక్కడ ఉన్న వారు అక్కడ ఉండిపోవాలని.. ఎవరు ఇళ్ల నుండి బయటకు రాకూడదు అని కేంద్రం చెప్పింది. దీంతో ప్రజలంతా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉంటున్నారు.. అందరూ ఆనందంగా గడుపుతున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే వాట్సాప్ లో ఓ ప్రచారం జరుగుతుంది. అది ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కరోన  ప్రయోజనాలు.. 

 

* యంత్రాల్లాగా తయారైన మనుషులను మళ్లీ మామూలు మనుషులుగా తయారుచేసింది .

 

* కుటుంబ సభ్యులందరినీ ఒక్క చోటికి చేర్చి కుటుంబ విలువలను నేర్పించింది.

 

*  ఏ ప్రభుత్వం చేత సాధ్యం కాని మద్య , మాంస నిషేధాలను తాను అమలు చేసి చూపించింది .

 

* ఏ ప్రభుత్వం చేత సాధ్యం కాని జల, వాయు, ధ్వని కాలుష్య నిషేధాన్ని తాను అమలు చేసి చూపించింది .

 

* పోలీసుల రైడ్ ద్వారా సాధ్యం కాని వ్యభిచారాన్ని తాను సులువుగా నిలువరించింది.

 

* వారానికి ఒకసారి వచ్చే ఆదివారాన్ని కాదని ప్రతి దినాన్ని ఒక ఆదివారం గా మార్చింది.

 

* వాల్ పోస్టర్లు ,ఫ్లెక్సీలు, సౌండ్ బాక్స్ ల హోరుకు గ్యాప్ ఇచ్చింది.

 

* నిత్యం నెత్తురోడే రోడ్లను, నెత్తురు చిందించే హత్యలను నిరోధించింది.

 

* బయటి తిండి కి అలవాటు పడిన మనిషికి ఇంటి రుచి ని చూపించింది .

 

* నూడిల్స్ గోబీ ల బారి నుండి పిల్లలను కాపాడి అమ్మ ముద్దను అలవాటు చేసింది.

 

* ఆచార,బాహ్య భక్తికి బదులు,ఆత్మ భక్తిని నేర్పించింది .

 

* మనిషికి అవసరమైన పరిశుభ్రతను నేర్పించింది .

 

* రాజకీయ నాయకుల నోర్లు మూయించింది .

 

* ఎప్పుడు సంఘం, సేవ అంటూ తిరిగే వారికి దేవుని సన్నిధి  యొక్క అవసరతను గుర్తు చేసింది .

 

* ఎప్పుడూ సేవకుని ముఖం చూసే సంఘస్థులకు దేవుని ముఖాన్ని చూపించింది .

 

* గుంపు భక్తికి అలవాటుపడిన మనుషులకు ఏకాంత భక్తి యొక్క అవసరతను నేర్పించింది.

 

* సంఘముగా కూడు కొనకపోయినా మీ చందాను మాకు పంపండి అంటూ వెంట పడే పేరాశ బుద్ధి గల పాస్టర్లను బయటపెట్టింది .

 

* మందిని చూసి అతిశయ పడే సేవకులకు 'బోసి' తనాన్ని రుచి చూపించింది

 

* ప్రపంచవ్యాప్తంగా పెట్రేగిపోతున్న స్వస్థత బోధకులను తొడగొట్టి తోలు తీసింది. 

 

ఇది వాట్సాప్ లో జరుగుతున్న ప్రచారం.. మరి మీరు ఎం అంటారు? 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: