కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ ఎవరి సహకారం వాళ్ళు అందిస్తున్నారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ప్రతీ ఒక్కరు కూడా సహాయ౦ చేయడానికి ముందుకి వస్తున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇలా ఎవరికి వారు సహాయం చేయడానికి ముందుకి వచ్చి తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి భారీగా తెలుగు రాష్ట్రాలకు విరాళాలు అందుతున్నాయి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ ఇలా ఎవరికి వారుగా భారీ సహాయం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలకు. 

 

ఇది పక్కన పెడితే తాజాగా టాలీవుడ్ మొత్తం కూడా భారీ సహాయం చెయ్యాలని చూస్తుంది. నిర్మాతల మండలి, దర్శకుల మండలి మొత్తం కలిపి దాదాపు 400 కోట్లను తెలంగాణా ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్దమైనట్టు తెలుస్తుంది. దీనిపై నిర్మాతల మండలి మీడియా ముందుకి వచ్చి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కరోనా ను కట్టడి చేయడానికి అందరూ ముందుకి రావాల్సి ఉంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా తమ వంతుగా సహాయం చేయడానికి సిద్దమయ్యారు. కరోనా ఒకరి వలన కట్టడి అయ్యే వ్యాధి కాదు. 

 

కాబట్టి అందరి సహకారం ఉండాలి. తెలంగాణా మంత్రి కేటిఆర్ ని కలిసి ఈ చెక్ ని అందించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇక హీరోలు కూడా మరోసారి నిర్మాతల మండలికి తమ వంతు సహకారం కూడా అందించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అందించే ప్లాన్ చేస్తున్నారట. ఇక స్టార్ హీరోలు కూడా ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే ఇతర సహాయ నటులు కూడా ముందుకి వచ్చి సహాయం చెయ్యాలని భావిస్తున్నారు. కాగా మన దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 700కి దగ్గరలో ఉంది. మరణాలు కూడా పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: