జనతా కర్ఫ్యూలో భాగంగా దేశ ప్రజలందరు పాల్గొన్నారు. డాక్టర్స్ మీకు వందనాలు అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా కరతాళ ధ్వనులతో వైద్య బృందాన్ని అభినందించారు. పల్లెటూరు నుండి పట్టణం దాక ప్రతి ఒక్కరు కర్ఫ్యులో భాగమై తమ వంతు కృషి వారు చేశారు.

 

జనతా కర్ఫ్యూ పాటించిన అనంతరం దేశంలో మొదటగా 75జిల్లాలో లాక్ డౌన్ విధించారు.ఆ ప్రాంతాలల్లో లాక్ డౌన్ విధించిన కరోనా వైరస్ కేసులు ఏ మాత్రం తగ్గకుండా పెరుగుతూనే ఉండడంతో దేశ ప్రధాని మోడీ దేశంలో 21రోజులు లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్ తో వచ్చే సమస్యలను గుర్తించి నిత్యావసర వస్తువులను అందరికి అందించే కోణంలో ఉన్నారు.

 

ఇటు రాష్ట్రంలోను లాక్ డౌన్ ను కఠినంగా వ్యవహరిస్తున్నారు. బయటికి వచ్చిన వారిని చితకబాదుతున్నారు. ఇటు చిన్న పల్లెటూరులోను లాక్ డౌన్ ను ఆచరిస్తున్నారు. వాళ్ళ ఊర్లోకి వేరే ఊరు వారు రాకుండా కంచెను నాటుతున్నారు. పల్లెల నుంచి పట్టణాల వరకూ మంచి స్పందన వస్తోంది. ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా సహకరిస్తున్నారు. 

 

కొన్ని గ్రామాల్లో మా ఊరికి రావద్దంటూ శివారుల్లో ఏకంగా కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇతరులెవరు వచ్చినా ఊళ్లోకి అనుమతించడం లేదు. ఊళ్లో వారిని కూడా బయటకు వెళ్లనీయడం లేదు. పట్టణాల్లో సైతం కొన్ని కాలనీలకు ఎవరినీ రానీయకుండా బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఇలాగే ఉద్యమంగా కొనసాగాలి.. మహ్మమ్మారిని రూపుమాపాలని అందరూ కోరుకుంటున్నారు.

 

పల్లెటూరిలో పాలు, కూరగాయలు, ధాన్యం, పప్పుల అక్కడే దొరుకుతాయి. కానీ కాలనీల్లో కంచెలు వేస్తే మాత్రం కష్టం. అత్యవసర సేవలు అందించాల్సిన వైద్యులు, విద్యుత్‌, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బంది, పాత్రికేయులు ఇలా చాలా మంది ఉంటుంటారు. కాలనీల్లో ఉండే దుకాణాలకు సరుకులు, కూరగాయలు రావాలి. పాలు రావాలి. నీళ్ల ట్యాంకర్లు రావాలి ఆలా చేస్తే అందరు ఇబ్బందిపడ్డతారు 


కొన్ని రోజుల క్రితం వైద్యుల బృందాన్ని అభినందించిన వారు ఇప్పుడు వారిని అనుమానంగా చూస్తున్నారు. కాలనీలో వైద్యులు, నర్సులు ఉంటే వారు విధులకు వెళ్లేప్పుడు చప్పట్లు కొట్టి అభినందించి పంపాలి. కాలనీలను మూసివేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదని చాలామంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: