అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అక్కడ కరోనా కేసులు రోజు రోజుకి భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా సరే కరోనా వైరస్ అనేది తీవ్రంగా ఉంటుంది. దాదాపు పది రాష్ట్రాల్లో అయితే వేల కొద్దీ మరణాలు నమోదు కావడం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతుంది. దాదాపు చైనాకు దగ్గరగా ఉన్నాయి కరోనా కేసులు. కాని క్యూర్ అయిన కేసులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మరణాలు భారీగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వం దాదాపుగా చేతులు ఎత్తేసినట్టే కనపడుతుంది. 

 

కరోనా కారణంగా  అమెరికాలో మూడు వారాల్లో భారీగా మరణాలు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో దాదాపు లక్ష మంది వరకు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దేశం మొత్తం కూడా ఇప్పుడు కరోనా తీవ్రతకు అల్లాడిపోతుంది. అక్కడ పరిస్థితులు కూడా ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశాలు కనపడటం లేదు. దాదాపు 80 వేల మందికి కరోనా వైరస్ సోకింది. కరోనా తీవ్రత ఆ స్థాయిలో ఉంది మరి. ఇది పక్కన పెడితే అక్కడ ఆర్ధిక వ్యవస్థ కూడా కరోనా వైరస్ కారణంగా పూర్తిగా కూలిపోయింది. 

 

ఇన్నాళ్ళు బలమైన ఆర్ధిక శక్తిగా ఉన్న అమెరికా ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంది. అన్ని రంగాల్లో కూడా వ్యాపారాలు దాదాపుగా పడిపోయాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా మరణాలు ఆగే అవకాశం లేదని పలువురు అంటున్నారు. కరోనా వైరస్ తీవ్రతను అంచనా వేయలేని స్థితిలోకి అమెరికా వెళ్లిపోయింది అంటున్నారు. అమెరికాలో ఆర్మీకి కూడా కరోనా వైరస్ సోకింది అనే వార్తలు ఇప్పుడు ఆ దేశాన్ని మరింతగా కలవరపెడుతున్నాయి. కరోనాకు అమెరికా మందు కనుక్కునే ప్రయత్నాల్లో ఉంది. ఈ మందు కూడా ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: