ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు అందరూ కూడా విలవిలలాడిపోతున్నారు. కరోనా వైరస్ ని అదుపు చేయడం ఎలాగో అర్ధం కాక ప్రపంచ దేశాలు అన్నీ కూడా తల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దీని గురించి దీని లక్షణాల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద ఇప్పటికే వైద్యులు చాలా విషయాలు చెప్పారు. కరోనా లక్షణాలు కొత్తవి కూడా చెప్పారు. ఇన్నాళ్ళు జలుబు జ్వరం మాత్రమే చెప్పిన వైద్యులు ఇప్పుడు విరోచనాలను చెప్పాడ౦ ఆందోళన కలిగించింది. 

 

దీనితో విరోచనాలు అయిన వాళ్ళు అందరూ ఆస్పత్రులకు వెళ్ళే పరిస్థితి ఉంది. కరోనా వైరస్ వస్తే లంగ్స్ పూర్తిగా నాశనం అయ్యే వరకు ఆ వ్యాధి వదిలిపెట్టే అవకాశం లేదని అది భవిష్యత్తులో కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. ఇప్పుడు వ్యాధి నయం అయినా సరే ఊపిరితిత్తుల సామర్ధ్యం అనేది భారీగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కరోనా వైరస్ అనేది శరీరం మీద దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తుంది అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

మరణాలు ఇందుకే వస్తున్నాయని, వృద్దులు తట్టుకోలేక చనిపోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం విదేశాల్లో మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీనిని అదుపు చేయడం అనేది అక్కడి ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదు. చాలా దేశాల్లో వైద్య సదుపాయాలు అనేవి తక్కువగా ఉన్నాయి. అమెరికా లాంటి దేశం కూడా ఇప్పుడు వైద్య సదుపాయాలు లేక అవస్థలు పడుతుంది. మన దేశంలో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అవి అదుపులోకి వచ్చే పరిస్తితిలోనే ఉన్నాయి గాని మరణాల సంఖ్యా ఒక్కటే ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. మరి ఇది ఎప్పుడు కంట్రోల్ అవుతుందో ఏమో చెప్పలేని పరిస్థితి.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: