ఓ వైపు దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా హెచ్చరిస్తుంటే.. కొంత మంది మూర్ఖులు అవేవీ పట్టనట్టు యథావిధిగా తమ కార్యాకలాపాలు చేసుకుంటూ పోతున్నారు.  ఈ సమయంలో కరోనా గాల్లో ఉందని దాని ప్రభావం తీవ్ర రూపంలో ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  తాజాగా తెలంగాణ పోలీసుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లతో, ఆంధ్రప్రదేశ్ బార్డర్ వద్దకు చేరుకుని, అక్కడి పోలీసులపై రాళ్ల దాడికి దిగిన ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్రంగా స్పందించారు.  ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో ఇతర ప్రదేశాల్లో ఉన్నవారు ఏపిలోకి రావడానికి ఆయా రాష్ట్రాల నుంచి అబ్జెక్షన్ సర్టిఫికెట్లతో ఏపిలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే.  అయితే వారికి కరోనా పరీక్షలు నిర్వహించి ఒకవేళ లక్షణాలు ఉంటే అక్కడే క్వారంటైన్ చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో  దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్ట్ వద్ద జరిగిన దాడి దురదృష్టకరమైనదని వ్యాఖ్యానించిన ఆయన, ఇటువంటి చర్యలు గర్హనీయమని, రాళ్ల దాడికి పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.  పోలీసులు తమ కుటుంబాలను వారి బాగోగులను పక్కన బెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం వైరస్ ని కూడా లెక్క చేయకుండా తమ విధులు నిర్వహిస్తుంటే వారి త్యాగానికి సంఘీభావం తెలపాల్సింది పోయి  రాళ్ల దాడి చేయడం ఏంటీ అయిన డీజీపీ ఎంతో సీరియస్ అయ్యారు. 

 

కరోనా కట్టడికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రమిస్తున్న వేళ, బాధ్యతగల పౌరులుగా ఉండాల్సిన యువత, ఇలా రాత్రి సమయంలో దాడులు చేయడం ఏ మేరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సరిహద్దుల్లో ఉన్న అధికారులు మెడికల్ ఎమర్జెన్సీ ప్రొటోకాల్ ప్రకారమే విధులు నిర్వహించారని, అన్ని రాష్ట్రాల మధ్య సరిహద్దులు మూసి వేయబడ్డాయని గౌతమ్ సవాంగ్ గుర్తు చేశారు. ఇలాంటి చర్యలు మళ్లీ పునావృతం అయితే మాత్రం పరిస్థితి తీవ్ర స్థాయిలో ఉంటుందని.. క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: