కరోనా మహమ్మారి వ్యాప్తి మన దేశంలో విపరీతంగా పెరుగుతున్న వేళ... ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటిస్తూ ప్రజలందరినీ బయటికి రాకుండా ఇళ్లలోనే కూర్చోమని ఆదేశించారు. ఐతే ప్రధాని మోడీ చెప్పినట్టుగా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి తమ ప్రజలను బయటకు రాకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇల్లు లేని వారు బయటనే సంచరిస్తూ ఫుట్ పాత్ లపై నిద్రపోతుండగా వారిని అక్కడి నుండి ఖాళీ చేయాలంటూ పోలీసులు బాగా ఇబ్బంది పెడుతున్నారు. దాంతో ఎక్కడికి పోవాలో తెలియని వేల మంది దారుణమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.

 

 

అయితే ఢిల్లీ లో ఉంటున్న తిండి, ఆశ్రమం లేని వేలమందిని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి వారికి సాయం చేస్తుంది. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు అధికారి బిపిన్ రాయ్ ఓ ప్రముఖ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ... తల దాచుకునేందుకు ఇల్లు లేని వారందరికీ బేసిక్ సౌకర్యాలను కల్పిస్తున్నాము. వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియకపోయిన మేము మధ్యాహ్నం, రాత్రి భోజనం ఫ్రీ గా అందిస్తున్నాము. ఇల్లు లేని వారు ఎవరైనా ఇక్కడ ఆశ్రమం పొందవచ్చు, అలాగే ఆకలి గా ఉన్నవారు కూడా ఇక్కడ భోజనం చేయొచ్చు' అని చెప్పారు.




ఆయన ఇంకా మాట్లాడుతూ... బుధవారం రోజు గత మూడు రోజులుగా అన్నం తినని 18, 500 మందికి భోజనం పెట్టామని, అలాగే భోజనం కోసం వరుసలో నిల్చున్న వారిని దూరదూరంగా ఉంచుతున్నామని అన్నారు. మాస్కులు, హ్యాండ్ శానిటైజెర్లు కూడా పంచామని ఆయన తెలిపారు. ఇంకా ఎక్కువగా రాత్రి ఆశ్రమాలను ఓపెన్ చేసి మిగతా వాళ్లందరికీ కూడా ఉచితంగా ఆహారాన్ని అందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు భోజనం పెట్టి అందరి మన్ననలను పొందుతున్నారు ఢిల్లీ  ప్రభుత్వ అధికారులు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: