సృష్టికి విరుద్దంగా జరిగిన ప్రయోగం కరోనా.. ఇది యమధర్మ రాజును సైతం వణికిస్తుందనుకుంటా.. అంతలా నిర్ధాక్షిణ్యంగా మనుషుల ప్రాణాలు తీసేస్తుంది.. లోకంలో పాపాలు పెరిగినట్లుగా, కరోనా మరణాలు పెరుగుతున్నాయి.. ఇకపోతే కరోనా భయంతో చైనా కాల్చివెయ్ అంటుంది. నార్త్ కొరియా చంపెయ్ అని ఆర్డర్లు వేస్తుంది.. రష్యా జైల్లో పెట్టమంటుంది.  ఇటలీ కళ్లముందే ప్రాణాలు తీస్తుంది.. కానీ ఒక్క భారతదేశం మాత్రమే ఇంట్లో కూర్చొని బ్రతికిపోమంటుంది..

 

 

ఇంత మంచిగా చెప్పే దేశం ఏక్కడైనా ఉందా.. ఈ మాటకూడా వినకుంటే దీని పర్యావసనం ప్రతి భారతీయుడు అనుభవించి తీరవలసిందే.. ఇకపోతే చావు బ్రతుకులు ఎక్కడో లేవు..  ధైర్యం లోనే బ్రతుకు ఉంది... భయం లోనే చావు ఉంది.. ఒక్క సారి భయపడడం మొదలు పెడితే.. నీ నీడ కూడా నిన్ను భయ పెడుతుంది.. అందుకే భయపడకుండా కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఒక్కటే మార్గం సోషల్ డిస్టెన్స్ పాటించడం.. అధికారులు చెప్పినట్లుగా వినడం.. ఇక కరోనా విషయంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల ఇది ఎంత వేగంగా వ్యాపిస్తుందో తెలుసుకుంటే మైండ్ గిర్రున తిరుగుతుంది.

 

 

ఒక మిల్లి సెకెన్ లో కరోనా వైరస్ అంటుకోవడానికి నీ చుట్టూ ఉంది. ఏమీ అవ్వదు అని నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. మనకంటే ఎంతో..  డెవలప్‌ అయిన దేశాల్లో మరణమృదంగం మోగుతోంది. ఇక ఈ కరోనా బారిన సామాన్యుల నుండి అద్యక్షులు, అపర కుబేరులు, సెలబ్రెటీలు, వీఐపీలు ఇలా అందరూ పడ్డారు..

 

 

ఇదిలా ఉండగా ఢిల్లీలో ఓ మహిళ ద్వారా ఓ డాక్టర్ కు కరోనా వైరస్ సోకింది. టెస్టులు చేయగా పాజిటివ్ గా తేలింది. అయితే ఈ డాక్టర్ కరోనా సోకిన తరువాత కూడా సుమారుగా 900 మందికి పైగా ట్రీట్ మెంట్ చేసినట్టు తెలియడంతో వారందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు జరపగా, కరోనా పాజిటివ్ లక్షణాలు వీరికి కనబడినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. సో ప్రజల్లారా బ్రతకాలంటే బరితెగించక తప్పదు.. చావాలనుకుంటే మీరొక్కరే చావండి కాని ప్రజల ప్రాణాలతో మాత్రం ఆడుకోకండి.. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: