కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఓ 45 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం ఇతనిని ఐసోలేషన్ వార్డులో ఉంచగా... అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలంగాణ వైద్యాధికారులు చెబుతున్నారు. ఈయన ఇంతకుముందు ఢిల్లీకి వెళ్లి వచ్చినట్టు సమాచారం. ఈ కేసుతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.




ఇకపోతే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఎలా ఉందంటే... ఆరోగ్యశాఖ నివేదికల ప్రకారం 724 కేసులు నమోదు కాగా 17 మంది కరోనా రోగులు మరణించారు. గుజరాత్, మహారాష్ట్ర లలో ముగ్గురు మరణించగా, కర్ణాటక లో ఇద్దరు, మధ్యప్రదేశ్, తమిళనాడు, బీహార్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లలో ఒక్కొక్కరు మరణించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర లో 124 కరోనా కేసులు నమోదు కాగా... ఆ తర్వాత కేరళ రాష్ట్రంలో 118 కేసులు నమోదయ్యాయి.

 

కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటివరకు 55 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో 43, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లలో 41 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 36, పంజాబ్ లో 33 కోవిడ్ 19 కేసులు నమోదు కాగా... హర్యానాలో 30 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన నరేంద్ర మోడీ చెప్పినట్టుగా అందరు సోషల్ డిస్టెన్స్ ని సరిగానే పాటిస్తున్నారు. అందుకే కరోనా కేసుల సంఖ్య మరీ అధికంగా నమోదు కావడం లేదని వైద్య అధికారులు భావిస్తున్నారు.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: