ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ జాగ్రత్త చర్యలను జారీ చేశారు. తాజాగా గుంటూరు జిల్లాలో తోలి పాజిటివ్ కేస్ నమోదయ్యింది. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు, అతని బంధువులకు కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే వారిలో ఐదుగురి పరిస్థితి అనుమానాస్పదంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అతడితో కలిసి ప్రయాణించిన 16 మందిని, అతనికి దగ్గరగా తిరిగిన మరో 13 మందిని వారి హౌస్‌ క్వారంటైన్‌కు తరలించారు. అంతే కాకుండా ఆ ప్రాంతానికి కూడా హై అలెర్ట్ ప్రకటించారు.

 

 

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గుంటూరులోని కొన్ని కాలనీలను రెడ్ జోన్‌ ఏరియాగా ప్రకటించింది. ఆ జాబితాలో మంగళదాస్ నగర్, అరుంధతి నగర్, rtc కాలనీ, అంబేద్కర్ నగర్, సీత నగర్, నెహ్రూ నగర్, వాసవి నగర్ ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న ప్రాంతాలకు ఎవ్వరిని వెళ్లోద్దని, అక్కడి ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు.  చిన్న పిల్లల్లను, 60 ఏళ్ళ వయస్సు పైబడిన వృద్ధులను, అస్సలు బయటకు రానివ్వకూడదని సూచించారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

రెడ్ అలెర్ట్ ప్రకటించిన ఏరియాల్లో శానిటైజేషన్ ప్రక్రియను కూడా మొదలు పెట్టారు. ఇంటింటికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా మొత్తం 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో చాలామంది కొద్ది రోజుల క్రితం విదేశాల నుండి వచ్చిన వారే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మహమ్మారిని రాష్ట్రంలో పెంచకుండా ఉండడానికి మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.        

మరింత సమాచారం తెలుసుకోండి: