కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు అన్ని విధాలుగా అండదండలందిస్తోంది. సామాన్యులను మొదలుకొని ఓ స్థాయి ఉద్యోగి వరకూ అంతా ఇప్పుడు ఈఎంఐలపై ఆధాపడి ఉంటున్నారు. ఏదైనా వస్తువు కొనాలన్నా ఈఎంఐ పద్దతిలోనే కొంటున్నారు. అలాంటి సమయంలో అకస్మాత్తుగా వచ్చిపడిన కరోనా మహమ్మారితో అందరి బడ్జెట్లూ తల్లకిందులయ్యాయి.

 

 

వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. స్వయంఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. ఉద్యోగస్తులకూ ఇబ్బందులు తప్పడం లేదు. అందుకే ఈ కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ఆర్బీఐ కూడా ముందుకు వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న సమయంలో పలు కీలక నిర్ణయాలతో సామాన్యుడికి ఊరట కలిగించింది.

 

 

వాటిలో అన్నింటికంటే ఎక్కువగా సామాన్యుడికి ఉపయోగపడేది ఈఎంఐలపై మారటోరియం. అన్నిరకాల ఈఎంఐలపై ఆర్బీఐ 3 నెలల పాటు మారటోరియం విధించింది. అంటే వచ్చే మూడు నెలల పాటు ఎవరూ ఈఎంఐలు కట్టకపోయినా పరవాలేదన్నమాట. ఈ నిర్ణయంతో చిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇక ఈ నిర్ణయంతో పాటు ఆర్బీఐ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది.

 

 

అవేమిటంటే.. రెపోరేటు 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. రివర్స్‌ రెపోరేటును 90 పాయింట్లకు కుదించింది. దీనివల్ల ప్రస్తుతం రెపోరేటు 4.4 శాతం, రివర్స్‌ రెపోరేటు 4 శాతందా ఉన్నాయి.ఆర్థిక స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. వైరస్‌ వ్యాప్తి, దాని తీవ్రత ఎంత కాలం కొనసాగనుందన్న అంశాలపైనే భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయని గవర్నర్ తెలిపారు.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: