గత రెండు రోజుల క్రితం కృష్ణ జిల్లా తిరువూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన దైదా రామకృష్ణ అనే వ్యక్తి మార్చి 23 అర్ధరాత్రి ఖమ్మం జిల్లా బీరాపల్లి వెళ్లే దారిలో ఉన్న ఎన్‌ఎస్పీ కాలువ వద్ద అనుమానాస్పదంగా  చనిపోయి ఉన్నాడు. దీంతో రామకృష్ణ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా పోలీసులు నిజాన్ని కనుగొన్నారు. ఆ డేటా ఆధారంగా విస్సన్నపేట మండలం వీరరాఘవాపురం గ్రామానికి చెందిన కారుమంచి విజయరావును అదుపులోకి తీసుకుని విచారించారు. అతన్ని విచారించగా అసలు నిజం బయట పడింది. పోలీసులు అతని మరణానికి గల కారణాలను బయటపెట్టారు. ప్రేమే తన హత్యకు కారణమని పోలీసులు నిర్థారించారు.

 

అసలు విషయంలోకి వెళితే.. విజయరావు పెయింటర్‌ గా పనిచేశేవాడు. అయితే.. అతనికి తిరువూరు మండలంల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి పరిచయం ఏర్పడింది. కాలం గడుస్తున్నా కొద్దీ విజయరావు ఆ యువతితో ప్రేమలో పడ్డాడు. అప్పటి నుంచి అతను ఆ యువతితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాడు. తాను ప్రేమించిన యువతిని తన స్నేహితుడైన రామకృష్ణ ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న విజయరావు తన ప్రేమకు అడ్డొస్తున్నాడన్న ఆవేశంతో విజయ రావు.. రామకృష్ణను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.

 

తాను చేసుకున్న ప్లాన్ ప్రకారం రెండ్రోజుల క్రితం ఇద్దరు కలిసి మందు తాగుదామని బయటికి వెళ్ళారు. ఇద్దరూ బైక్‌ పై ఖమ్మం జిల్లా వేంసూరు మండలం బీరాపల్లి వెళ్లి మద్యం సీసాలు తెచ్చుకుని లక్ష్మీ పురం గ్రామ పరిధిలోని ఎన్‌ఎస్పీ కాలువ కట్టపై కలిసి మందు తాగారు. అనంతరం విజయ రావు మంచం పట్టెతో అతని తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం అయిన రామకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు అతన్ని విచారించిన తరవాత తానే ఈ నేరం చేశానని విజయరావు ఒప్పుకున్నాడు. అనంతరం అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: