ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను క‌రోనా వైర‌స్ వ‌ణికిస్తుంది. దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో ప్ర‌జ‌లు ఇంటికే ప‌రిమితం అయ్యారు.  దాదాపు 300 కోట్ల జ‌నాభా ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌లో ఉన్న‌ది. ఇక ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి 21 వేల మంది చ‌నిపోగా.. ఈ వైర‌స్ బారిన ప‌డిన‌వాళ్లు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్నారు. అయితే ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ కామంతో క‌ళ్లు మూసుకుపోయిన కొంద‌రు కామాంధులు ఆగ‌డాల‌కు అడ్డు లేకుండా పోతుంది.

 

కోడిపిల్లను గద్ద తన్నుకుపోయినట్లు అభంశుభం తెలియని పాలబుగ్గల పసిబిడ్డలను సైతం కామాంధులు వదలడం లేదు. మాయమాటలు చెప్పి బలవంతంగా చిన్నారులను ఎత్తుకుపోయి పైశాచికత్వానికి పాల్పడుతున్నారు. చిన్నారులు, మహిళలపై దాడుల నిరోధానికి ఇప్పటికే పోక్సో చట్టం అమలులో ఉండగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. అయిన‌ప్ప‌టికీ ప‌రిస్థితుల్లో మార్పు రావ‌డంతో లేదు. ఇక తాజాగా  గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు ఏడో తరగతి బాలికపై అత్యాచారానికి యత్నించిన ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చేబ్రోలు మండల పరిధిలో ఏడో తరగతి చదువుతున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు ప్రేమ పేరుతో మాయ మాట‌లు చెబుతూ వెంట తిప్పుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే మూడురోజుల క్రితం స‌ద‌రు బాలుడు ఆమెకు ఫోన్ చేసి.. నీతో మాట్లాడాలంటూ ఓ నిర్మానుష్య ప్రాంతానికి రప్పించాడు. అత‌డి మాట‌ల‌ను గుడ్డిగా న‌మ్మి.. ఒంటరిగా వెళ్లిన స‌ద‌రు బాలికను తన ఇద్దరు స్నేహితులతో కలిసి బాలుడు బంధించాడు. 

 

ఈ క్ర‌మంలోనే ఆమెపై ఆ ముగ్గురు కలిసి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె దుస్తులు విప్పేందుకు ప్రయత్నిస్తుండగా బాలిక గ‌ట్టి గ‌ట్టిగా కేకలు వేస్తూ.. ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. కంగారు ప‌డుతున్న కూతురుని గ‌మ‌నించిన త‌ల్లిదండ్రులు ప్ర‌శ్నంచ‌గా.. బాలిక అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టంది. దీంతో వెంట‌నే ఆమె త‌ల్ల‌దండ్రులు చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: