భారతదేశంలో వయసు పై బడిన వారు కరోనా దెబ్బకి మృత్యవాత పడుతున్నారు. ఇటీవల కర్ణాటక లోని తుమకూరు జిల్లాకి చెందిన ఓ 65 ఏళ్ళ వ్యక్తి కి కోవిడ్ 19 వ్యాధి ఉందని నిర్ధారణ కాగా ఆయన చికిత్స పొందుతూ ఈరోజు మరణించారు. దాంతో తుమకూరు జిల్లాలో కోవిడ్ 19 వ్యాధి కారణంగా తొలి మరణం నమోదు కాగా కర్ణాటక రాష్ట్రంలో ఇది మూడవ కరోనా మరణం అయింది.



డిప్యూటీ కమిషనర్ డాక్టర్. కే. రాకేష్ కుమార్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ... శుక్రవారం రోజు ఉదయం 10 గంటల 45 నిమిషాలకు కరోనా వ్యాధిగ్రస్తుడు చనిపోయాడని తెలియజేసారు. ఐతే మృతుడు తుమకూరు జిల్లాలోని సిరా ప్రాంతానికి చెందిన వాడని తెలుస్తుంది. ఈయన మార్చి 5వ తేదీన బెంగళూరు నుండి ఢిల్లీ కి ఓ ట్రైన్ లో ప్రయాణం చేశాడు. మార్చి ఏడవ తేదీన ఢిల్లీకి చేరుకున్న ఇతనికి ఏ లాడ్జి లో కూడా రూం దొరకలేదు. దాంతో ఆయన ఢిల్లీ లోని జామియా మసీదు లో మార్చి 7 నుండి మార్చి 11 వరకు ఉన్నాడు.




అనంతరం అనగా మార్చి 11వ తేదీ సాయంత్రం ఆయన ఢిల్లీ నుండి బయలుదేరి మార్చి 14న తన స్వస్థలమైన సిరా కి చేరుకున్నాడు. ఐతే తనకు బాగా దగ్గు, జ్వరం రావడంతో మార్చి 21వ తేదీన తుమకూరు లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో చెకప్ చేయించుకోగా... తన వైద్య పరీక్షలలో కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన్ని మార్చి 24న ప్రభుత్వ ఆస్పటల్ లో ని ఐసొలేషన్ వార్డు కి తరలించారు వైద్యాధికారులు. ఐతే మార్చి 25 పొద్దున మూడు గంటల సమయంలో తాను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోగా... ఈరోజు తన తుది శ్వాస విడిచాడు.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: