ప్రపంచానికి పెద్దన్న, అగ్ర రాజ్యం అమెరికా అన్ని విషయాలలో ముందు ఉంటుంది. తన స్థాయి ఏంటో ప్రపంచానికి చాటి చెప్తూ, తన మాట వినని దేశాలపై దాడులు చేసయినా తమ దారిలోకి తెచ్చుకోవడంలో అమెరికాని మించిన దేశం మరొకటి లేదు. అందుకే అగ్ర రాజ్యంగా కీర్తి పొందుతూ పెద్దన్న పాత్ర పోషిస్తూ వచ్చింది. అయితే కరోనా విషయంలో కూడా తామేమి తక్కువ కాదని అందులో కూడా మేము ముందు వరసలో ఉంటామని చెప్పకనే చెప్పింది..చైనాని తలదన్ని మరీ కరోనా వైరస్ కేసుల విషయంలో మొదటి స్థానంలో నిలిచింది....అర్థం కాలేదా సరే అసలు విషయం ఏమిటంటే...

IHG

చైనాలో కరోనా ఏంటీ ఇచ్చిన తరువాత ప్రపంచ దేశాలు అలెర్ట్ అయ్యాయి. కానీ అగ్ర రాజ్యం కదా మనం చెప్తేనే కాని కరోనా అమెరికాలోకి ఎంట్రీ ఇవ్వదని ట్రంప్ అనుకున్నారో ఏమో కాని, అమెరికా వ్యాప్తంగా అందరిని అలెర్ట్ చేయడం మానేసి కరోనా లేదు గిరోనా లేదు అంటూ తొడలు కొట్టారు...ఫలితంగా ఇప్పుడు కనీసం శానిటైజేషన్ కూడా సప్లై చేసుకోలేని పరిస్థితికి అమెరికా వెళ్ళింది. అమెరికాకి తలమానికమైన

IHG

న్యూయార్క్ నగరాన్ని ఇప్పుడు కరోనా కకలావికలం చేస్తోంది. ఒక్క సారిగా అమెరికాలో మృతుల సంఖ్య 1300 లకి చేరుకుంది. ఇక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అయితే ప్రపంచ దేశాలు అన్నిటికంటే కూడా టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 81,943 కి చేరుకుందని ఇది చైనా సంఖ్య 81,285 ని దాటేసిందని తెలుస్తోంది. అయితే పాజిటివ్ కేసుల సంఖ్యలోనే అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉందని మృతుల సంఖ్యలో అయితే చైనానే ముందుందని అంటున్నారు నిపుణులు. ఏది ఏమైనా కరోనా విషయంలో కూడా అమెరికా అగ్ర రాజ్యం అనిపించుకుందని తాజా లెక్కల ప్రకారం అర్థమవుతోంది. కానీ మరొక వారంలో అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరగనుందని, అదే గనుకా జరిగితే అమెరికాలో డేంజర్ బెల్స్ మోగడం ఖాయమని అంటున్నారు పరిశోధకులు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: