ఈరోజు ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం సరికాదని జగన్ ట్విస్ట్ ఇచ్చారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం 2020 - 21లో మూడు నెలల బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వం కరోనా నియంత్రణకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేశారు. 
 
ఆరుగురు మంత్రులు, 10 మంది ఐఏఎస్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీలో ఉంటారని తెలిపారు. రాష్ట్రానికి దాదాపు 28 వేల మంది విదేశీయులు వచ్చారని... ప్రజలు ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమాచారం కోసమైనా 24 గంటలు 104 హెల్ప్ లైన్ నంబర్ ను సంప్రదించవచ్చని అన్నారు. 24 గంటలు ఈ నంబర్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కరోనా బాధితుల కోసం 100 పడకల ఐసోలేటెడ్ బెడ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. 
 
200 పడకల ఆసుపత్రులను ప్రజలకు జిల్లా స్థాయిలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. స్వీయనియంత్రణ పాటించి కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో కరోనా ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేశారు. రాష్ట్రంలో సరుకుల రవాణా వాహనాలను అనుమతిస్తున్నామని అన్నారు. ప్రతిపక్షాలు కరోనా వైరస్ ను కూడా రాజకీయం చేస్తున్నాయని విమర్శలు చేశారు. 
 
రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సామాజిక దూరం పాటించాలని కోరారు. శానిటైజర్స్ అందుబాటులో లేనివారు సబ్బుతో చేతులను కడుక్కోవాలని సూచించారు. ఏ రాష్ట్రంలో ఉన్నవారు అక్కడే ఉండిపోవాలని... ఇతర రాష్ట్రాల సీఎంలతో జగన్ మాట్లాడుతున్నారని తెలిపారు. శనివారం అక్వా ఎగుమతిదారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: