దేశంలో ఇప్పుడు లాక్ డౌన్ చేశారు.  బయటకు వెళ్లాలంటే భయపడేలా చేస్తుంది కరోనా వైరస్.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతటి వారైనా ఇంటి పట్టునే ఉండాలని.. మరి అత్యవసర పరిస్థితుల్లో  తప్ప ఎవరూ బయటకు రావొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.  మరి లాక్ డౌన్ ఉన్న పరిస్థితుల్లో చిరు ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఓ అనుమానం ఈరోజు వరకు పట్టి పిడించింది.  తాము వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాం.. వస్తువులు తీసుకున్నాం.. వాటికి ఈఎంఐలు ప్రతినెల టెన్షన్ గా కట్టాలి లేదంటే చెక్ బౌన్స్.. వైన్లు ఇలా ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉందన్న భయం నెలకొంది. తాజాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. వీటిలో రెపో రేటు తగ్గింపు, రుణ ఈఎంఐలపై 3 నెలల మారటోరియం వంటివి కూడా భాగమే.

 

ఆర్‌బీఐ రేట్ల కోత వల్ల రుణాలపై వడ్డీ రేట్లు బాగా తగ్గే అవకాశం కూడా ఉంది. టర్మ్ లోన్స్‌కు ఈ మారటోరియం వర్తిస్తుందని పేర్కొంది. అంటే హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్ వంటి వాటికి ఇది వర్తిస్తుంది. కన్సూమర్ డ్యూరబుల్ లోన్స్‌కు మారటోరియం ఉంటుంది. అంటే ఫ్రిజ్, స్మార్ట్‌ఫోన్, టీవీ వంటి వాటి కొనుగోలుకు రుణం తీసుకున్న వారు కూడా ఈఎంఐ కట్టక్కర్లేదు. ఈఎంఐ కట్టక్కర్లేదంటే కేవలం వాయిదా వేశారని అర్థం. 3 నెలల తర్వాత మళ్లీ ఈఎంఐలు కట్టాలి. మీ లోన్ టెన్యూర్ 3 నెలలు పెరుగుతుంది.

 

తాజాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న నిర్ణయం అభినందనీయమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు.  ఈ నిర్ణయం సన్న, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. నగదు క్రెడిట్‌, ఓవర్‌ డ్రాఫ్ట్‌ రూపంలో చెల్లింపులు వాయిదాకు అనుమతించడం లాభదాయకమన్నారు.

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: