దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటు రాష్ట్రం ప్రజలకు తగు జాగ్రత్తలు చెప్తూ వారిలో కరోనాపై చైతన్యం కలిగిస్తున్నారు. మరోవైపు విదేశాల నుండి వచ్చిన వారిపై నిఘా పెడుతున్నారు. వారిని ఆస్పత్రిలో డాక్టర్లు ఐసోలేషన్‌ వార్డులో ఉంచి పరీక్షిస్తున్నారు. 

 
అయితే తాజాగా గుంటూరులో కరోనా అనుమానిత వ్యక్తి పరారైయ్యాడు. కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో ఈనెల 25న గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. అతను గురువారం ఆస్పత్రి నుంచి పారిపోయాడని జీజీహెచ్‌ ఆర్‌ఎంవో ఆదినారాయణ చెబుతున్నారు. ఆర్‌ఎంవో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా అనుమానితుడు పారిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతుండగా.. అతడి వివరాలపై ఆరా తీస్తున్నారు.


ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 12కు చేరాయి. వీటిలో గుంటూరులో ఒకటి. పొరుగునే ఉన్న విజయవాడలో మూడు కేసులు నమోదయ్యాయి. పలువురు అనుమానితుల్ని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. అలాగే గుంటూరులో పాజిటివ్ కేసు నమోదు కావడంతో కొన్ని కాలనీలను రెడ్ జోన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అరుంధతి నగర్, నెహ్రూ నగర్, ఆర్టీసీ కాలనీ,  సీతా నగర్, వాసవి నగర్‌, మంగళదాస్ నగర్, అంబేద్కర్ నగర్ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో శానిటేషన్ చేశారు.

 

మరోవైపు వార్డు వాలంటీర్ల సాయంతో నగరంలో ప్రతి కుటుంబానికి సంబంధించితన హెల్త్ రిపోర్ట్‌ను నమోదు చేస్తున్నారు. విదేశాల నుంచి ఎవరైనా వచ్చారా అని ఆరా తీస్తున్నారు. ఒకవేళ వచ్చి ఉంటే.. వారి ఆరోగ్య పరిస్థితి.. హోమ్ క్వారంటైన్‌ వివరాలను సేకరిస్తున్నారు. ప్రాణాంతక  కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అందులో  భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా క్వారంటైన్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి నియోజక వర్గంలోనూ క్వారంటైన్ పడకలను ఏర్పాట చేసింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple :https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: