కరోనా వైరస్ ధనిక, పేద అనే తేడా లేకుండా అందరిని వణికిస్తోంది. పీఎం మోదీ లాక్ డౌన్ విధించడంతో అందరి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోంచి అడుగు కూడా బయటికి పెట్టడం లేదు. బయటికి వెళ్తే ఎక్కడ ఆ వైరస్ అంటుకుంటుందేమోనని భయపడి చస్తున్నారు. ఈ కరోనా వైరస్ ప్రభావం అందరి పైనా చూపిస్తుండటంతో ఎప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియటం లేదు. ఇటీవల ముంబైలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కోవిడ్- 19 సోకిందని కట్టుకున్న పెళ్ళాన్ని, కన్న కొడుకును వదిలేసాడు. ఈ సంఘటన మరువక ముందే ఇంకో ఘటన చోటుచేసుకుంది.

 

ఓ వ్యక్తి తన తమ్ముడు బయటికి వెళ్లి ఇంటికి వచ్చాడనే కోపంతో కత్తితో పొడిచిన ఘటన ముంబైలోనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భారత్ లో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ముంబై నగర పరిధిలోని కందివాలిలో రాజేష్, లక్ష్మి ఠాకూర్, దుర్గేష్ అనే అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. తన తమ్ముడు దుర్గేష్ పూణెలోని ఓక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ను అదుపుచేయడానికి లాక్ డౌన్ ప్రకటించటంతో అతను తన సొంతూరు అయిన కందివాలికి వచ్చాడు. అయితే దుర్గేష్ కిరాణ సామగ్రి కొరకు బుధవారం మధ్యాహ్నాం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి రాత్రి సమయంలో సరుకులు తీసుకుని ఇంటికి వచ్చాడు. తన అన్న రాజేష్ అతని పై లాక్‌ డౌన్ సమయంలో అసలు ఇంట్లోంచి ఎందుకు బయటికి వెళ్లావని ఆయన అన్న రాజేష్‌, అయన భార్య అతనిపై అగ్రహం వ్యక్తం చేశారు.

 

కాగా., ఈ నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య వివాదం మొదలయింది. ఈ వివాదం కాస్త కత్తిపోట్ల వరకు దారి తీసింది. ఈ క్రమంలోనే రాజేష్ తన తమ్ముడయిన దుర్గేష్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో.. తీవ్రంగా గాయపడిన దుర్గేష్‌ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దుర్గేష్ ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రాజేష్ పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: