జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైఖ‌రి వివాదంగా మారింది. ప్ర‌స్తుతం దేశంలోను, రెండు తెలుగు రాష్ట్రా ల్లో నూ క‌రోనా భూతం విజృంభిస్తోంది. ఈ స‌మ‌యంలో అంద‌రూ అలెర్ట్ అవుతున్నారు. ఎవ‌రి జాగ్ర‌త్త‌లు వారు తీసుకుంటున్నారు. మ‌రి ఈ స‌మ‌యంలో ఓ పార్టీ అధినేత‌గా, ఓ సెల‌బ్రెటీగా ప‌వ‌న్ చేయాల్సిన ప‌ని.. ప్ర‌జ ల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌డం. క‌ర్ఫ్యూ వంటివి విధిస్తున్నా కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్న ప్ర‌జ‌ల‌ను క‌ట్ట‌డి చేయ డం కోసం త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేసి అవేర్‌నెస్ క‌ల్పించ‌డం. అయితే, వీటికి దూరంగా ఉంటున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.



జ‌న‌సేన త‌ర‌ఫున ఏపీలో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని, ప్ర‌జ‌ల‌కు త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు చేరువై.. త‌మ వం తు ప్ర‌య‌త్నం చేస్తార‌ని ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తార‌ని అన్నారు. దీనికి సంబంధించి ప్ర‌త్యేక కార్యాచ ర‌ణ కూడా చేప‌ట్టిన‌ట్టు పేర్కొన్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఆదిశ‌గా ఏపీలో ఎక్క‌డా జ‌న‌సేన నాయ‌కు లు, కార్య‌క‌ర్త‌లు ఎలాంటి ప‌నులూ చేప‌ట్ట‌లేదు. ఇదిలావుంటే, ప‌వ‌న్ కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పో రాడే క్రమంలో ఏపీ, తెలంగాణ సీఎం సహాయ నిధులకు రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయల విరాళం అందిస్తాను.  అలాగే భారత ప్రధాన మంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందిస్తాన`ని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు.



ఓకే. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలోను, ప్ర‌జ‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌డంలోను ప్ర‌భుత్వాలు చేప‌ట్టిన చ‌ర్య‌ల విష‌యంలో ప్ర‌భుత్వాధి నేత‌ల‌కే ఇంకా సంతృప్తిలేదు. పైగా వారు ఈ విష యంలో ఇంకా ఓ క్లారిటీకి రాలేదు. ప్ర‌జ‌ల‌కు నిత్యావ‌స‌రాలు అందుతున్నాయా?  ఇబ్బందులు ప‌డుతు న్నారా? అనే విష‌యంలో స్ప‌ష్ట‌త‌లేదు. పైగా రోజురోజుకు పెరుగుతున్న క‌రోనా కేసులు కూడా ప్ర‌భుత్వాల కు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. ఇలాంటి  ప‌రిస్థితి దేశ‌వ్యాప్తంగా ఉంటే.. ప‌వ‌న్ మాత్రం ప్ర‌భుత్వాల‌ను పొగుడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తివంతమైన నాయకత్వం కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడుతుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.



అంతేకాదు,  తెలంగాణలో కరోనా‌ వ్యాప్తి నిరోధానికి మంచి చర్యలు తీసుకుంటున్నారని  పవన్ కల్యాణ్‌ అన్నారు. కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మెసేజ్‌ చేశారు. ఇలాంటి అల్లకల్లోల సమయాల్లో కేసీఆర్‌ నాయకత్వంలో..మీరు చేపట్టిన చర్యల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని తెలిపారు. దీంతో ఆయ‌న పొగ‌డ్త‌ల‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. ఇంకా ప్ర‌భుత్వాల‌కే స్ప‌ష్ట‌లేని ప‌రిస్థితిలో కొట్టుమిట్టాడుతుంటే.. ఈ పొగ‌డ్త‌లెందుకు? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఏదైనా ఉంటే సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వ‌కుండా ఇలా సంకీర్త‌న‌లు చేసే స‌మ‌యం ఇదేనా ?  నీకేమైనా అర్థ‌మ‌వుతోందా ? అని అంటున్నారు .మ‌రి ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: