తెలంగాణలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇప్పుడు 50కి చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఓ వైపు ఆదివారం నుంచి జనతా కర్ఫ్యూ తర్వాత లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ రోజు రోజుకీ ఈ కరోనా తీవ్రత పెరిగిపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.  ప్రజలు ఇంకా తమ పనుల్లో బిజీగా ఉన్నారా.. బయట తిరుగుతున్నారా? అన్న ప్రశ్నలు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సంధించారు. దేశం మొత్తం లాక్ డౌన్ అయినా తెలంగాణ లో మాత్రం పలు ప్రాంతాల్లో జనాలు నిర్భయంగా తిరుగుతున్నారని.. అప్పుడు కరోనాని ఎట్టా కట్టడి చేస్తారని ఆయన మండిపడ్డారు.  ఈ నేపథ్యంలో వరిసారి నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ప్రజలు బాధ్యతగా ఉండాలని, కనిపిస్తే కాల్చి పారేసే వరకూ తెచ్చుకోవద్దని తీవ్రంగా హెచ్చరించారు.   

 

రాష్ట్రంలో కరోనా కట్టడి, లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు విషయాలపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో పలు కీలక అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల వరకు పటిష్ఠమైన కర్ఫ్యూ అమలు చేస్తోంది. మార్చి 31 వరకే కర్ఫ్యూను అమలు చేస్తామని తొలుత ప్రకటించారు. రాత్రి పూట కర్ఫ్యూను 21 రోజులకు అంటే ఏప్రిల్ 14 వరకు పెంచాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

 

దీనిని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.  మరోవైపు రాష్ట్రంలో 47 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఈటెల రాజేందర్ అన్నారు. తాజాగా రెండు కేసులు పెరిగాయని అన్నారు. తెలంగాణలో మొదటి కరోనా పాజిటివ్ కేసు వచ్చిన తర్వాత సీఎం ఆధ్వర్యంలో హై లెవల్ కమిటీ ఏర్పాటు చెసామని అన్నారు.  రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు ఉన్నాయన్న ఆయన  ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న పరికరాలు సహా వైద్య సిబ్బంది కూడా తమ సహకారం అందిస్తామని ముందుకు వచ్చారని అన్నారు.

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: