ఎప్పుడైతే చైనాలో కరోనా వైరస్ విజృంభించిందో అప్పటినుండి చాలా దేశస్తులు వారిని వారి ఆహారపు అలవాట్లను తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా కరోనా వైరస్ ని చైనా వైరస్ గా పిలిచాడు. ఐతే జాత్యహంకారంతో డోనాల్డ్ ట్రంప్ ఇలా పిలవడం సరికాదని చాలామంది అతడిని తిట్టిపోశారు. ఐతే మన దక్షిణ భారత దేశంలో నివసించే వారు మాత్రం చూడడానికి చైనీయులుగా కనిపించే ఈశాన్య భారతీయులను టార్గెట్ చేస్తూ కరోనా వైరస్ అని పిలవడం ప్రారంభించారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ నుండి తెలుగు రాష్ట్రానికి వలస వచ్చి హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఇంగ్లీషు పత్రికలో జర్నలిస్టుగా పని చేస్తున్న ఓ యువతిపై కొంతమంది ఆకతాయిలు తీవ్ర విమర్శలు చేశారు. లీమి కేచి అనే ఓ మహిళా జర్నలిస్టు మాత్రల కోసం మెడికల్ షాప్ కి బయలుదేరగా... మార్గమధ్యంలో కొంతమంది ఆకతాయిలు ఆమెను 'హే, కరోనా వైరస్' అంటూ హేళన చేసారు.




దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు మహిళా జర్నలిస్ట్... సామాజిక మాధ్యమాలలో తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. మార్చి 26వ తేదీన మందుల షాప్ కి వెళ్తుంటే కొంతమంది నన్ను కరోనా వైరస్ అని పిలిచారు. మేము ప్రస్తుతం కరోనా వైరస్ తో పోరాడలేకపోతుంటే... వీళ్ళేమో మిమల్ని ఆ వైరస్ కంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు. ఆ వైరస్ కంటే వీరి మైండ్ లో ఉన్న వైరస్ మాకు చాలా ప్రమాదకరంగా మారింది. మేము కూడా భారతీయులం అని గుర్తుంచుకోండి. ఇంకోక్కసారి ఎవరైనా ఇలాంటివి పునరావృతం చేస్తే... వారిపై ఫిర్యాదు చేస్తానని... ఈ సమస్య ఎవరికి ఎదురుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ తో సహా పీఎం నరేంద్ర మోడీని ట్యాగ్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.




అయితే ఆమె పోస్ట్ కి స్పందించిన మంత్రి కేటీఆర్ కరోనా మహమ్మారిని ఎదుర్కొనే ఈ సమయంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని... ఇలాంటివి చేయడం ఎంత మాత్రము సమంజసం కాదని... నిందితులపై కేసు నమోదు చేయమని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. వాస్తవానికి మంత్రి కేటీఆర్ ఈ ఒక్క విషయంలోనే కాదు... లాక్ డౌన్ సమయంలో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తున్నారు. అందుకే ప్రస్తుతం అతనికి లభిస్తున్న ప్రశంసలు తెలుగు రాష్ట్రాలలోనే ఏ రాజకీయ నేతకు లభించడం లేదని చెప్పుకోవచ్చు.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple : https://tinyurl.com/NIHWNapple



 

 

మరింత సమాచారం తెలుసుకోండి: