చైనాలో పుట్టిన కరోనా రక్కసి, మెల్లమెల్లగా ప్రపంచంలోని అన్నీ దేశాలకు వ్యాపించి అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రతిరోజూ ఎన్నో ప్రాణాలు ఈ వైరస్ కు బలవుతున్నాయి.  అగ్రదేశమైన అమెరికా కూడా దీని వల్ల అల్లాడిపోతుంది. ఇక ఇటలీ అయితే కరోనా విషయంలో చైనాను అధిగమించింది. ఈ కోవిడ్-19 దెబ్బకు ఎవ్వరు తుమ్మినా, దగ్గినా జనం హడలిపోతున్నారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి పెన్విల్వేనియాలోని హనోవర్‌లో చోటు చేసుకుంది.

 

 

వివరాల్లోకి వెళ్తే, గురువారం రోజున హనోవర్‌లోని గెర్రిటీ సూపర్ మార్కెట్‌కు ఓ మహిళ వచ్చింది. ఆమె లోపలికి రాగానే, ముఖానికి ఉన్న మాస్క్‌ను తీసేసి, అక్కడ ఉన్న మాంసం, పండ్లు, బేకరి ఉత్పత్తులు, కూరగాయాలుపై పదే పదే దగ్గింది. దాంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, ఆమెను బయటకు గెంటేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ కావాలనే అక్కడ ఉన్న ఆహారపదార్థాలపై దగ్గినట్లు పోలీసులు వెల్లడించారు. కానీ ఆమె ఎవరో? ఎందుకు అలా ప్రవర్తించిందో? ఇంకా తెలియలేదు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

అసలే అమెరికా కరోనా వైరస్ వల్ల నానా ఇబ్బందులు పడుతుండటంతో, ఆ స్టోర్ యాజమాన్యం కీలక ఒక  నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల ఆరోగ్యం దృష్ట్యా సూపర్ మార్కెట్‌లో ఉన్న 35 వేల డాలర్ల అంటే రూ.26 లక్షలు విలువైన ఆహార పదార్థాలను పడేసారు. వాటిని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, రసాయనాలు పోసి తగులబెట్టారు. ఆ తర్వాత ఆ సూపర్ మార్కెట్ మొత్తాన్ని శానిటైజ్ చేసి, కొన్ని గంటల వ్యవధిలోనే సూపర్ మార్కెట్‌ను మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. కానీ, ఈ ఘటన వల్ల హనోవర్ ప్రాంతంలోని ప్రజలు భయంతో హడలెత్తిపోతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: