ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి అనుమతులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్ఛిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను ఎంట్రీ పాయింట్ లోనే పరిశీంచాలని... వారు ఆరోగ్యపరంగా బాగుంటే రాష్ట్రంలోకి కచ్చితంగా అనుమతించాలని సూచించింది. కరోనా లక్షణాలు కనిపిస్తే మాత్రమే వారిని క్వారంటైన్ కు తరలించాలని సూచించింది. 
 
క్వారంటైన్ అవసరం లేని వారిని ఇంటికే పరిమితం చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ రాష్ట్ర సరిహద్దుల్లో పరిస్థితులపై హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ఏపీ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతుందో చూడాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ గురించి స్పష్టత రావాల్సి ఉంది. 
 
హైకోర్టు ఆదేశాల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లతో ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవారిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించడం హైదరాబాద్ నగరంలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో ఊరట కలిగిస్తుందని చెప్పారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగుల ఆందోళనను అర్థం చేసుకున్న కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నవారు అవసరమైన వారిని క్వారంటైన్ చేయాలని... లేనివారిని హోం క్వారంటైన్ చేయాలనే ఆదేశాలను గౌరవించాలని సూచించారు. వారి బాధకు స్పందించి పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణకు అభినందనలు తెలిపారు. ఏపీ హైకోర్టు తీర్పుపై ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ విద్యార్థులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: