ప్రస్తుతం కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఎక్క‌డ చైనాలోని వుహాన్ న‌గ‌రం.. ఎక్క‌డ అమెరికా.. ఎక్క‌డ యూర‌ప్ అస‌లు ఈ లింకులు చూస్తుంటే ఒక దానికి మ‌రొక‌టి సంబంధ‌మే లేదు. కేవ‌లం ఒక మ‌నిషి నుంచి మ‌రో మ‌నిషికి ఈ వైర‌స్ చాలా శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతుంద‌నే చెప్పాలి. ప్ర‌పంచ మ‌హ‌మ్మారిగా మారిన క‌రోనా ఇప్ప‌టికే ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఇప్పటివరకు ఈ ప్రాణాంతకమైన మహమ్మారి వైరస్ 200 దేశాలకు పైగా వ్యాపించింది.



ప్ర‌పంచం అంతా లాక్ డౌన్ పాటించి దీనిపై ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా క‌రోనాకు మాత్రం బ్రేకులు వేయ‌లేక‌పోతున్నాం. అస‌లే క‌రోనా గురించి ఎవ‌రికి వారు భ‌య‌ప‌డుతున్నారు. దీనికి తోడు అటు మీడియాలోనూ.. ఇటు సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న వార్త‌లు కూడా ప్ర‌జ‌ల‌ను తీవ్ర గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. దోమకాటుతో కరోనా వైరస్ సోకుతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజల్లో లేనిపోని అపోహలు కలుగుతున్నాయి.


స‌హ‌జంగానే దోమ కాటు ద్వారా అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయ‌న్న‌ది తెలిసిందే. దీంతో ఇప్పుడు క‌రోనా వైర‌స్ సైతం శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతుంద‌డంతో దోమ కాటుకు కూడా క‌రోనా వ‌చ్చేస్తుంద‌ని ఈ ప్ర‌చారాన్ని చాలా మంది న‌మ్మేస్తున్నారు. ఇది మ‌రింత భ‌యంక‌రం అయ్యేలా ఉంది. అస‌లు ఇలాంటి ప్ర‌చ‌రాలు ఎందుకు చేస్తారో ?  కూడా అర్థం కాని ప‌రిస్థితి. అయితే ఈ అపోహ‌ల‌తో ప్ర‌జ‌ల్లో లేని భ‌యాందోళ‌న‌లు పెర‌గ‌డంతో దీనిపై కేంద్రం స్పందించింది.



ఈ అపోహల‌ను కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. దోమకాటు ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందదని స్పష్టం చేసింది. మందు తాగడంవల్ల, వెల్లుల్లి తినడంవల్ల కరోనా రాకుండా అడ్డుకోలేమని తెలిపింది. ఇక మ‌రి కొంద‌రు ప‌సుపు తింటే కూడా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌ని పుకార్లు ప్ర‌చారం చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: