ఇది నిజంగా  అరుదైన  సందర్భం. ఎందుకంటే ఇపుడు ఏపీ సహా దేశమంతా ఇబ్బందులో ఉంది. అది మామూలు ఇబ్బంది కాదు. కనబడని శత్రువుతో  అంతా యుధ్ధం చేస్తున్నారు. ఇటువంటి కీలమైన వేళ  కూడా రాజకీయాల కోసం పాకులాడడం బాధాకరమే కాదు,  ఏహ్యమైన విషయం,  దారుణమైన విషయం కూడా.

 

అయితే ఏపీలో టీడీపీ మాత్రం జగన్ సర్కార్ మీద యధా ప్రకారం బురద జల్లుతూనే ఉంది. జగన్ ఎంత చేస్తున్నా అందులో తప్పులను వెతుకుతూ శాడిస్టిక్ గా బిహేవ్ చేస్తోంది. మరో వైపు ఫార్టీ యియర్స్ చంద్రబాబు ఓవైపు మోడీని మెచ్చుకుంటూ లేఖలు రాస్తారు. అదే సమయంలో జగన్ని మాత్రం నిందిస్తారు. ముఖ్యమంత్రిగా  జగన్ చేసిన ప్రసంగం ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయిందని బాబు ఘాటు వ్యాఖ్యలు చేయడం వెనక పచ్చి రాజకీయమే ఉందని అంటున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఇపుడు రాజకీయ పరిణతిని బాగానే కనబరుస్తున్నారు. ఆయన తనకు తోచిన  ఆర్దిక సాయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు ఇవ్వడమే కాకుండా పాలకులకు నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తున్నారు. అదే విధంగా ఇది రాజకీయాలకు సమయం కాదని పవన్ అనడమూ విశేషమే.

 

ఏపీ సర్కార్ కరోనాపై సాగిస్తున్న సమరానికి మా మద్దతు పూర్తిగా ఉంటుదని పవన్ అంటున్నారు. గ్రామ వాలంటీర్లు ఏపీలో పని చేస్తున్నారు. వారికి తోడుగా జనసైనికులు కూడా రంగంలోకి దిగి ప్రజలకు చైతన్యం చేయాలని పవన్ కోరారు. ఇది అందరూ సమిష్టిగా కలసి కరోనాని ఎదుర్కోవాల్సిన సందర్భం అని పవన్ అనడం ద్వారా ఫార్టీ యియర్స్ చంద్రబాబు కంటే బెటర్ అనిపించుకున్నారు.

 

 

మరి ఇదే విధంగా మిగిలిన పార్టీలు కూడా దారికి వచ్చినట్లైతేనే ఏపీలో పొలిటికల్ వైరస్ ముందు తగ్గుముఖం పడుతుంది. అపుడు కరోనా వైరస్ పై పోరాటం మరింత సులువు అవుతుంది. అలా చేయాలనే అంతా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: