దేశంలో ఇప్పుడు లాక్ డౌన్ చేశారు. కరోనా మహమ్మారిపై యుద్దం ప్రకటించారు. చైనా లోని పుహాన్ నుంచి పుట్టుకొచ్చిన ఈ మాయదారి వైరస్ ప్రపంచం మొత్తం కబ్జా చేసింది.  ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్ ఇలాంటి దేశాల్లో విలయతాండవం చేస్తుంది.  వేల మంది మరణాలు సంబవిస్తున్నాయి.  అమెరికాల లాంటి పెద్ద దేశంలో కూడా కరోనా పంజా విసురుతుంది.  తాజాగా భారత్ లో ఈ ప్రభావం మొదలు కావడంతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేశారు.  దాంతో నిత్యావసర వస్తువులు, మెడికల్ షాపులు తప్ప అన్నీ మూసివేశారు.  అయితే ఇది మీ ఆరోగ్యం కోసం చేస్తున్న పనులు మాత్రమే అని దీనికి అందరి సహకారం ఉండాలని ప్రభుత్వాల చెబుతున్నాయి. అంతా బాగుంది.. కానీ కొంత మంది వ్యసనపరులకు మాత్రం ఇది అస్సలు మింగుడు పడటం లేదు.

 

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో21 రోజుల పాటు వైన్ షాపులు మూసేసి ఉంచాలి.  దాంతో మందు బాబులు విలవిలలాడిపోతున్నారు.  మద్యం, గుట్కా ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారి పరిస్థితి దారుణంగా తయారైంది.. కొన్ని చోట్ల ఉన్మాదంగా ప్రవర్తించే పరిస్థితి కూడా తలెత్తుతుంది.  కేరళ వ్యాప్తంగా ఇప్పటికే మందు బాబులు మందు పడక నరాలు జివ్వుమని లాగుతుండటంతో ఏం చేయాలో అర్థం కాక డీఅడిక్షన్‌ సెంటర్‌లో చేరారు.  అలాంటి వారిని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి కరోనా ప్రభావం గురించి వారికి తెలియ జేస్తున్నారు. 

 

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఈ చోరీ జరిగింది. విశాఖ నగరంలోని గాజువాకలో పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలోనే చోరీ చేశారు దుండగులు. 12 కార్టన్ల మద్యాన్ని వారు ఎత్తుకెళ్లారు. అందులో 144 బాటిళ్లు ఉన్నాయని పోలీసులు చెప్పారు.  వీటి ఖరీదు సుమారు 1.50 వేలు ఉంటాయని షాపు యజమాని తెలియజేశారు.  ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: