శుక్రవారం సాయంత్రం తెలంగాణా సిఎం కెసిఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. తెలంగాణాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 59 గా ఉందని ఆయన వివరించారు. ఇవాళ ఒక్క రోజే 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కెసిఆర్ వివరించారు. తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. 60 వేల మందికి కరోనా వైరస్ సోకినా సరే తాము ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని కెసిఆర్ స్పష్టం చేసారు. 

 

తెలంగాణాలో కరోనా వైరస్ ఏ విధంగా ప్రభావం చూపించినా సరే తాము సిద్దంగా ఉంటామని అన్నారు. లాక్ డౌన్ చేయకపోతే తెలంగాణాలో కరోనా వైరస్ ఇంకా ప్రభావం చూపించేది అందరి ప్రాణాలు ప్రమాదంలో ఉండేవని కెసిఆర్ చెప్పారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా కేసులు పెరిగాయని ఆయన అన్నారు. ఒకవేళ లాక్ డౌన్ ప్రకటించకపోయి ఉంటే... ఇటలీ, అమెరికా పరిస్థితులు మన దేశంలో వస్తే మాత్రం కచ్చితంగా 20 కోట్ల మందికి సోకుతుందని ఆయన సంచలన విషయం వెల్లడించారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

 

తెలంగాణా ప్రభుత్వం కరోనా మీద యుద్ధం చేస్తుందని ఎవరూ కూడా భయపడవద్దని జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. గుంపులు గుంపులు గా ఎవరూ రావొద్దని అందరూ ఇంట్లోనే ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. అయితే కెసిఆర్ మాటల్లో చూస్తే పరిస్థితి చాలా సీరియస్ గా ఉందనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఏ స్థాయిలో కరోనా వైరస్ ప్రభావం చూపిస్తుందో కెసిఆర్ మాటల్లో స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా వైరస్ ప్రస్తుతం అదుపులో ఉందని లాక్ డౌన్ ని పాటిస్తే మాత్రం కచ్చితంగా కరోనా కట్టడి అవుతుందని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: