ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలో రోజురోజుకు విజృంభిస్తోంది. ముందుగా మూడు కేసులతో తెలంగాణలో మొదలైన క‌రోనా వైరస్ శుక్రవారంతో ఏకంగా 47 కేసులకు ఎగబాకింది. తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వైరస్ మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిల‌తోనే ఈ కరోనా వైరస్ తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇక ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ ప్ర‌తి విష‌యంలోనూ ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకుంటున్నా తెలంగాణ ప్ర‌జ‌లు మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నారు. 

 

దీంతో తెలంగాణ‌లో ప‌రిస్థితులు చేయి దాటిపోయే ప్ర‌మాదం ఉండ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్ర ప్ర‌భుత్వం సాయం కోరింది. కేంద్ర బ‌ల‌గాల‌ను తెలంగాణ‌కు పంపాల‌ని కోర‌డంతో ఇప్ప‌టికే కేంద్ర బ‌ల‌గాలు చేరుకుంటున్నాయి. ఇక రేప‌టి నుంచి ఈ కేంద్ర బ‌ల‌గాలు హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ లోని అన్ని జిల్లా కేంద్రాక‌లు చేరు కోనున్నాయి. ఎవ‌రైనా ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా రోడ్ల మీద‌కు వ‌స్తే వాళ్ల‌ను ఎడా పెడా ఏకి ప‌డేయ‌డం ఖాయ‌మైంది. ఇప్ప‌టికే రాష్ట్ర పోలీసులు ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటున్నా చాలా మంది ఇంకా రోడ్ల‌మీద‌కు వ‌స్తున్నారు.

 

దీనిని బ‌ట్టి కేసీఆర్ క‌రోనా విష‌యంలో ఎంత సీరియ‌స్‌గా ఉంటున్నారో తెలుస్తోంది. గ‌త వారం రోజుల వ్య‌వ‌ధిలోనే ఏకంగా నాలుగు సార్లు ప్రెస్‌మీట్ పెట్టారంటేనే అర్థ‌మ‌వుతోంది. అయినా తెలంగాణ ప్ర‌జ‌లు చాలా మంది ఇష్ట‌రాజ్యంగా రోడ్ల‌మీద‌కు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌రిస్థితి కంట్రోల్ త‌ప్ప‌కుండా ఉండేందుకే ఆయ‌న కేంద్ర బ‌ల‌గాల‌ను ఆశ్ర‌యించారు. ఇక శుక్ర‌వారం ఒక్క రోజు అక్క‌డ ఏకంగా 10 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. శుక్ర‌వారం తో అక్క‌డ క‌రోనా పాజిటివ్ బాధితు సంఖ్య 59కు చేరుకుంది. ఇక ఇప్ప‌టికే 25 వేల‌కు పైగా ప్ర‌జ‌లు క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ ప‌రిస్థితి మ‌రింత ప్ర‌మాద క‌రంగా మార‌కూడ‌ద‌ని... క‌రోనా విస్పోట‌నం జ‌ర‌గ‌కూడ‌ద‌నే కేసీఆర్ కేంద్ర బ‌ల‌గాల‌ను ర‌ప్పించార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: