కరోనా వైరస్ తో ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాతాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా టెస్టింగ్ కిట్ల సంఖ్య భారీగా పెంచాలని అన్నారు. దక్షిణ కొరియా లో కరోనా టెస్ట్ కిట్స్ ఎక్కువగా ఉండటంతో అక్కడ కరోనా అదుపులోకి వచ్చిందని నిమిషాల వ్యవధిలో పరిక్షలు చేసి వారికి చికిత్స అందిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఆక్వా, పౌల్ట్రీ రైతులు భారీగా దెబ్బ తిన్నారు అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. 

 

విదేశాల నుంచి వచ్చిన  వారిని క్వారంటైన్ లో ఉంచితే మాత్రం కరోనా వ్యాపించేది కాదని అన్నారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, చాలా గ్రామాలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నాయని, అందరూ అలాగే పాటించాలని ఆయన సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారు కంట్రోల్ లో ఉండటం లేదని చంద్రబాబు ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేసారు. ప్రభుత్వం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం రైతు బజార్లను పెంచాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగం తీవ్రంగా ఇబ్బంది పడుతుందని అన్నారు. 

 

సామాజిక దూరం పాటిస్తేనే కరోనాను ఎదుర్కోగలమని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. 80 ఏళ్ల పైబడిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. అదే విధంగా ముందు జాగ్రత్తలు పాటించడం వల్లే.. అనేక దేశాల్లో కరోనా నియంత్రణలో ఉందని ఆయన సూచించారు. కరోనాకు మందులు లేవని అన్నారు. స్వయం నియంత్రణే మందని చంద్రబాబు హితవు పలికారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా పలు సూచనలు చేసారు. సమాజహితం కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని చంద్రబాబు హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: