ప్ర‌పంచ దేశాల‌న్నింటిని వ‌ణికించేస్తోన్న క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో ఇప్ప‌టికే 3 ల‌క్ష‌ల మంది ఆ వ్యాధి భారీన ప‌డ్డారు. ఇక జ‌ర్మ‌నీ.. ఇట‌లీ లాంటి దేశాల్లో అయిన క‌రోనా దెబ్బ‌కు మ‌ర‌ణ మృందంగం జ‌రుగుతోంది. ఏ రోజున ఏ క్ష‌ణాన ఎంత మంది చ‌నిపోతారో కూడా తెలియ‌ట్లేదు. ఇక మ‌న దేశంలో కూడా క‌రోనా బాధితు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే చాలా మందికి క‌రోనా సోకిందా ?  లేదా ? అన్న‌ది కూడా తెలియ‌ని ప‌రిస్థితి. చాలా ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్‌ సోకిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించే 18 రకాల పరీక్షల కిట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో మూడు కిట్లు పూణేలోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ వైరాలజి’ తయారు చేసింది.

 

ఇక మ‌రో 15 కిట్లు ఇత‌ర దేశాల‌కు సంబంధించిన‌వి. ఇక ఈ కిట్ల‌కు సంబంధించి భార‌త ప్ర‌భుత్వం ఇప్ప‌టికే లైసెన్సులు.. స‌ర్టిఫికెట్లు సైతం జారీ చేసింది. ఈ 18 ర‌కాల కిట్ల‌ను త్వ‌ర‌గా త‌యారు చేసి మార్కెటింగ్ చేసేందుకు ఇప్ప‌టికే అనుమ‌తులు కూడా మంజూరు అయ్యాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశంలో క‌రోనా టెస్టులు చేసేందుకు స‌రిప‌డినంత కిట్లు లేక‌పోవ‌డంతో ఇప్పటి వరకు కేవలం 26 వేల మందికి మాత్రమే కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించగలిగారు. క‌రోనా కిట్ల కొర‌త నేప‌థ్యంలోనే ఇప్పుడు ఏకంగా 18 ర‌కాల కిట్ల‌కు అనుమ‌తులు మంజూరు చేసింది. వీటిని అవ‌స‌రాన్ని బ‌ట్టి విదేశాల నుంచి సైతం దిగుమ‌తి చేసుకునేందుకు సైతం కేంద్రం ఓకే చెప్పింది.

 

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా పాజిటివ్ ప‌రీక్ష‌లు కేవ‌లం పుణే సంస్థనే నిర్వహించాల్సి రావడంతో ఫ‌లితాల వెల్ల‌డి ఆలస్యానికి కారణమైంది. ఈ దశలో ‘సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌’ రంగంలోకి దిగడంతో లైసెన్స్‌ల ప్రక్రియ వేగవంతం అయింది. ఇక ఒక కిట్ రిలీజ్ చేసేందుకు లైసెన్స్ మంజూరు కావాలంటే ఈ కిట్ ద్వారా క‌నీసం 200 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి. ఏదేమైనా ఈ 18 కిట్లు అందుబాటులోకి వ‌స్తే మ‌న‌కు పెద్ద రిలీఫే అని చెప్పాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: