క‌రోనా ఇప్పుడు ప‌ల్లెటూరి జ‌నాల‌కే కాదు...అడ‌వుల్లో ఉన్న గిరిజ‌నుల‌కు సైతం సుప‌రిచితం అయిన పేరు. కరోనా కాటుకు జనం పిట్టల్లా రాలుతున్నారు. దేశాల‌కు దేశాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తున్నాయి. కరోనా వైరస్ కు మందు లేకపోవడంతో గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. దీంతో, మహమ్మారిలా ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచదేశాలన్ని మెడిసిన్‌ తయారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌ నడుస్తుండగా మ‌న‌దేశంలో ఈ ప్ర‌క్రియ మ‌రింత ఊపందుకుంది. 

 

మ‌న‌ దేశంలోని ప‌లు ఐఐటీలు క‌ష్ట‌స‌మ‌యంలో క‌రోనాపై ప‌రిశోధ‌న‌లు చేసి ఫ‌లితాల‌ను సాధిస్తున్నాయి. కరోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన ర‌క‌ర‌కాల ప‌రిక‌రాలు, శాటిటైజ‌ర్ల‌ను, ఇత‌రత్రా ప‌రిశోధ‌న‌ల‌ను దేశంలోని ఐఐటీలు నిర్వ‌హిస్తున్నాయి. ఇప్ప‌టికే ఐఐటీ గువాహ‌టిలో బ‌యోమెడిక‌ల్ ఇంజినీరింగ్ బృందం వైర‌స్‌పై ప‌రిశోధ‌న‌లు తీవ్ర‌త‌రంగా చేసింది. ఇక హైద‌రాబాద్‌లోని ఐఐటీ శానిటైజ‌ర్ల‌ను త‌యారుచేయ‌డ‌మే కాకుండా క‌రోనా వైర‌స్ నివార‌ణ‌కు వ్యాక్సిన్ త‌యారుచేసే ప‌నిలో నిమగ్న‌మైంది. ఇక ఢిల్లీలోని ఐఐటీ క‌రోనా టెస్ట్‌ల‌ను చేయ‌డానికి సంబంధించిన కిట్‌ల‌ను రూపొందించింది. త‌క్కువ ధ‌ర‌లో క‌రోనా వైర‌స్ నిర్ధ‌రాణ‌కు ఈ కిట్‌లు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ఇదే బాట‌లో ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప‌రిశోధ‌కులు పోర్ట‌బులిటీ వెంటిలేటర్ల‌ను త‌యారుచేసింది. 

 

మ‌రోవైపు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కరోనా వైరస్‌ సోకకుండా వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియ సత్ఫలితాలను ఇచ్చే దశకు చేరుకున్నట్లు ఆయ‌న  ప్రకటించారు. ఈ ప్రాణాంతక వైరస్ అంతానికి  మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీక్లోరోక్వినైన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేసినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. హైడ్రాక్సీక్లోరోక్వినైన్, అజిత్రోమైసిన్ కలయికతో అమెరికా శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న మెడిసిన్ కరోనాను నివారించే అవకాశం ఉందని తెలిపారు. 

 


కాగా, హైడ్రాక్సీక్లోరోక్వినైన్, అజిత్రోమైసిన్.. ఈ రెండింటి కలయికతో రూపొందే సరికొత్త ఔషధం ప్ర‌యోగం విజయవంతమైతే ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం ఆవిష్కృతం అవుతుందంటున్నారు. ఈ పరిశోధనలు చేస్తున్న ఫ్రాన్స్ సైంటిస్టులు వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యాంటీ-మైక్రోబయాల్ ఏజెంట్స్ లో ప్రచురించారు. అజిత్రోమైసిన్ కంటే హైడ్రాక్సీక్లోరోక్వినైన్ మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు. ఇదే అంశంపై రీసెర్చ్‌ చేస్తున్న ఎఫ్‌డీఐ కూడా ఈ రెండింటినీ వెంటనే వినియోగంలోకి తీసుకొస్తామనే విశ్వాసం వ్యక్తం చేసింది. మొత్తంగా అగ్రరాజ్య అధినేత ట్రంప్‌ ప్రకటన అందరిలో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: