అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ఇక కరోనా వైరస్ ప్రభావం పెరిగాక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. లాక్ డౌన్ మొదలయ్యాక పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇక ఈ లాక్ డౌన్ 21 రోజులే అని చెప్పినా, అది అంతటితోనే ముగుస్తుందా లేదా అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరి ఇలాంటి సమయంలో ఏపీ ఆర్ధిక పరిస్థితి ఎంతగా చితికిపోతుందో ప్రత్యేకంగా చెప్పాలసిన అవసరం లేదు.

 

ఈ లాక్ డౌన్ ప్రభావం వల్ల కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా ఎంతవరకు రాష్ట్రానికి చేరుతుందో అర్ధం కాకుండా ఉంది. ఇక కీలకంగా ఉన్న రవాణా, మైనింగ్, ఎక్సైజ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్  శాఖల నుంచి ఆదాయం తగ్గిపోయింది. అటు వ్యవసాయ, ఆక్వా రంగాలపై కూడా కరోనా ప్రభావం ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లైతే అసలే ఇబ్బందుల్లో ఉన్న ఏపీపై కరోనా గట్టి దెబ్బే కొట్టింది.

 

అయితే ఆర్ధిక పరిస్థితులు సరిగా లేకపోయినా, కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో ఎన్ని నిధులైన ఖర్చు పెట్టేందుకు సీఎం జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆ మేరకు ఖర్చు కూడా పెడుతోంది. ఈ క్రమంలోనే లాక్ డౌన్ ఉండటంతో, ఏప్రిల్ 4న పేద కుటుంబాలకు రూ. వెయ్యి, ఇంటింటికి రేషన్ అందించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది.

 

కాకపోతే మరో నాలుగు రోజుల్లో ఏప్రిల్ నెల మొదలు కానుంది. ఇక ఇటు ఉద్యోగులకు జీతాలు,  అటు పెన్షనర్లకు ఫించన్లు, సామాజిక పెన్షన్లు కూడా ఇవ్వాలి. కానీ ఆర్ధిక పరిస్థితి బాగోని కారణంగా ఇవి ఆపే అవకాశముందని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రభుత్వ వర్గాల మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నాయి. ఎట్టి పరిస్థితిల్లోనూ వీటిల్లో ఏది ఆగదని చెబుతున్నారు. ముఖ్యంగా 50 లక్షల మందికి పైగా అండగా ఉండే పెన్షన్స్ కార్యక్రమం ఆపడం కష్టమని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: