ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా ప్రభావాన్ని ఎంత కట్టడి చేసిన కూడా వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు.. జనతా కర్ఫ్యూ లో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతుంది..ఈ మేరకు ప్రజలను ఇళ్ళ నుంచి బయటకు రానివ్వకుండా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంది.. అయినా కొంత మంది పోలీసులు మమ్మల్ని ఏం చేస్తారు అనే దైర్యం తో ముందుకు వస్తున్నారు.. ఇకపోతే లాక్ డౌన్ కారణంగా అనేక సంస్థలు మూతపడ్డాయి..

 

 

అయితే కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళు ప్రత్యేక వార్డులలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.. విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్‌లో ఉండాలని చెబుతున్నా కొందరికి చెవికెక్కడం లేదు. నిబంధనలు ఉల్లంఘించి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన యువకుడిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తే.. ఆ యువకుడు అక్కడి నుంచి పరారైన సంఘటన తాజాగా వెలుగుచూసింది. అతనిని గాలించి పట్టుకుని ఎందుకు చేశావ్ ఈ పని అని ప్రశ్నించగా యువకుడు చెప్పిన సమాధానం విని అధికారులు, పోలీసులు షాకయ్యారు..


 

 

అలా పరారైన ఆ యువకుడు ప్రియురాలి ఇంట్లో దాక్కున్నాడు.. ఈ ఘటన తమిళ నాడు మధురైలో చోటుచేసుకుంది... ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే సడెన్‌గా ఆ యువకుడు క్వారంటైన్ కేంద్రం నుంచి వెళ్లిపోయాడు. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు బయట తిరగొదద్దని.. కరోనా లక్షణాలు లేకున్నా ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి పారిపోయాడు.


 

 

అతని జాడకోసం వెతికినా పోలీసులు చివరికి అతని  ప్రియురాలి ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని అతన్ని పట్టుకున్నారు..పోలీసు విచారణలో యువకుడు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తమ ప్రేమకు ప్రియురాలి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని.. అందుకే ప్రియురాలిని కలిసేందుకు వెళ్లానని చెప్పినట్లు సమాచారం. అయితే క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. అతన్ని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: