ప్రపంచాన్ని ముప్ప తిప్పలు పెడుతున్న కరోనా మహమ్మారి రోజు రోజు కీ విజృంభిస్తూనే ఉంది.  భారత్ లో దీని ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతుంది.  ఇప్పటికే భారత్ లో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. లాక్ డౌన్ ప్రకటించినా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.  ఇక శుక్రవారం ఉదయం వరకు భారత్ లో 724 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా మాదిరిగా మనదేశంలో కూడా కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.  

 

దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 75 కొత్త కేసులు నమోదయ్యాయని, నలుగురు మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.  కరోనా వంటి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడంలో డాక్టర్లకు క్లినికల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ఇస్తామని వివరించారు. కాగా, భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 851కి చేరింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 20 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా వైద్య కేంద్రాల్లో మరో 10 వేల వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.  గడిచిన నాలుగు రోజుల్లోనే భారత్ లో చాలా వేగంగా కరోనా కేసులు నమోదయ్యాయి.  

 

అత్యధికంగా  కేరళలో 137 , మహారాష్ట్రలో 130, కర్ణాటక 55, తెలంగాణ 45, రాజస్థాన్ 45 పాజిటివ్ కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ లో 43, ఉత్తరప్రదేశ్ లో 41, ఇక ఏపీలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే భారత్ లో కరోనాని అరికట్టేందుకు లాక్ డౌన్ చేసినా ప్రజలు మాత్రం బయట తిరుగుతున్నారు..  ఈ నేపథ్యంలో కొంత మందిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.  

 

 కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: